రాత్రంతా కష్టపడ్డ పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న రాత్రంతా కష్టపడ్డారు. ఇదంతా తన తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కోసమే. ఈ నెల 18న విడుదలవుతున్న ఈచిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ బ్యాలెన్స్ ఉండటంతో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కష్ట పడ్డాడు. రాత్రి కూడా ఇంటికి వెళ్లకుండా కంప్లీట్ చేసాడు. ఈ రోజు తెల్లవారు ఝామున పని ముగిసిన తర్వాతే అక్కడ నుంచి నిష్క్రమించారు.
పవన్ చాలా కష్ట పడ్డాడని, మధ్యలో కొంత సేపు మాత్రమే గ్యాప్ తీసుకుని డబ్బింగ్ వర్క్ మొత్తం పూర్తి చేసాడని యూనిట్ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ లోని శబ్దాలయ స్టూడియోలో ఈ డబ్బింగ్ కార్యక్రమం జరిగింది. ఇక తమన్నా పాత్రకు ప్రియాంక డబ్బింగ్ చెప్పింది. పవన్ కంటే ముందే ఈ వర్క్ కంప్లీట్ అయింది.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో అకీరా తండ్రితో కలిసి ఓ సాంగులో స్టెప్పులు వేసాడని సమాచారం.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











