అన్నయ్య గురించి మాట్లాడుతుంటే లోపల లావా బద్దలవుతున్నట్టుంది: పవన్
మేం మా సినిమాలు విజయాలు సాధించాలని కోరుకుంటాం..కానీ వేరే హీరోలను డామినేట్ చేయాలనే ఉద్దేశం మాకు ఉండదు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి మాకు కష్టం విలువ బాగా తెలుసు. మనుషులను ఎలా ప్రేమించాలో తెలుసు. అన్నయ్య గురించి మాట్లాడుతుంటే లోపల లావా బద్దలవుతున్నట్లుగా అనిపిస్తోంది..రోశయ్యగారు నేను కూడా చిరంజీవి అభిమానిని అని చెప్పారు.
ఆ వయసు నుంచి పసి వయసులో ఉన్నవారి వరకు అన్నయ్యకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అన్నయ్యది మంచి వ్యక్తిత్వం కాబట్టే అంతమంది అభిమానులను ఆయన సంపాధించుకోగలిగారు", అంతే కాదు ఎంతో విలువలున్న వ్యక్తి. సినిమా అంటే ఎంతో గౌరవం, భక్తి ఉన్నాయి. మా ఇంటికి సినిమా పత్రికలు చాలా వస్తుంటాయి. ఆ పత్రికల్లో మా ముఖ చిత్రాలు లేకుండా వేరే హీరోల కవర్ పేజి ఉన్నప్పటికీ వాటిని కూడా ఎంతో గౌరవప్రదంగా చూస్తారాయన. అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగంగా ప్రసంగించాడు.
అన్నయ్య సంస్కారానికి ఇది నిదర్శనం. ఎంతో ఉన్నత విలువలున్న వ్యక్తి అన్నయ్య ఎవరికీ చెడు కలగకూడదని కోరుకునే వ్యక్తి. పరిశ్రమలో అందరూ బాగుండాలని అనుకుంటాడు అన్నయ్య. కష్టపడి విజయం సాధించాలనుకుంటాడు. ఆ విషయంలో అన్నయ్య నాకు ఆదర్శం.


Click it and Unblock the Notifications











