సినిమాలు లేక వ్యవసాయం చేసిన పవన్ కళ్యాణ్

By Sindhu

పవన్ కళ్యాణ్ కి తెలుగు సినిమాలు నచ్చడం లేదు. కథకుల చెప్పే కథలు నచ్చడం లేదట. రాజీపడి చెత్త సినిమాలు చేయలేక పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ ఏం చేశాడో తెలుసా? హైదరాబాద్ శివార్లలోని ఓ ఎనిమిది ఎకరాల వ్యకసాయ భూమి లో ఫార్మ్ హౌస్ నిర్మించుకుని హాయిగా వ్యవసాయం చేసుకుంటూ, మొక్కలు పెంచుకుంటూ గడిపేశాడట. వ్యవసాయం మంటే ఎక్కువ మక్కువ, గర్డెనింగ్ చేయండం...అందుకోసం చాలా టైమ్ కూడా వెచ్చిస్తారట. సరిగ్గా ఆ సమయంలో ఖుషి డైరెక్టర్ ఎస్ జె సూర్య వచ్చి 'కొమరం పులి" కథ చెప్పి పవన్ కళ్యాణ్ ని సినిమా చేయడానికి ఒప్పించారట.

ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా కొమరం పులి ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాల ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడిన పవన్ కళ్యాణ్ తన దైన శైలిలో ఇలా నిరసన తెలిపారు. 'ఇప్పుడొస్తున్న సినిమాలు చూసినా, డైరెక్టర్స్ చెబుతున్న కథలు వింటున్నా నీరసం వస్తోంది. తెలుగు సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఉండాలని, ప్రపంచ స్టాండర్డ్స్ లో ఉండాలని కోరుకుంటాను. కాని మన సినిమా కథలు వాటికి చాలా దూరంగా, ఇంకా మూసగానే ఉంటున్నాయి..డబ్బు కోసం సినిమాలు చేయాలి..ఏదో కొంచెం గడ్డి తినగలం కాని..అదేపనిగా గడ్డితినలేం కదా.." అని పవన్ కళ్యాణ్ అనేసరికి హైదరాబాద్ హైటెక్స్ లో వందలాది మంది అభిమానులు పెద్ద పెట్టున చప్పట్లు కొట్టారు.

తనకు పవర్ స్టార్ అని పిలిపించుకోవడం కూడా చాలా సిగ్గుగా ఉంటుందని, ఎవరైనా అలా పిలుస్తుంటే తను భూమిలోకి కుంగిపోయినట్టు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పాడు. కొమరం పులి వేడుకలో పవన్ కళ్యాణ్ చాలా డౌన్ టు ఎర్గ్ గా బిహేవ్ చేసి, నిజాయితీగా మాట్లాడి అందరి హదయాలను హత్తుకున్నాడు. ఎదిగే కొద్దీ ఒదగాలనే సామెత అన్నయ్య చిరంజీవి ప్రదర్శిస్తే, తమ్ముడు పవన్ దానిని ఇంకా ఆచరణలో పెడుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X