హాట్ న్యూస్: పవన్ ప్యాన్స్ ని ఉద్దేశించి పూరీ

By Srikanya

పవన్ కళ్యాణ్ తర్వాత చిత్రం కెమెరా మెన్ గంగతో రాంబాబు అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథ రెడీ చేసుకున్న పూరీ జగన్నాధ్ ..పవన్ ని కలిసి నేరేషన్ ఇచ్చారు. పవన్ కి ఆ నేరేషన్ అద్బుతంగా నచ్చిందని పూరి చెప్తున్నారు. ఆ ఎక్సైట్ మెంట్ ని పవన్ అభిమానులతో పంచుకోవటానికి ఆయన చిన్న వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టారు. ఆ వీడియోలో పవన్ అభిమానులను ఉద్దేశించి పూరీ మాట్లాడారు.

పూరీ మాటల్లోనే... పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అందరికీ చిన్న న్యూస్. నిన్న నైట్ కళ్యాణ్ కి కెమెరామెన్ గంగతో రాంబాబు కథ చెప్పాను. కథ వినగానే ఆయన లేచి వచ్చి నన్ను హగ్ చేసుకుని లాంగ్ హగ్ అది. చాలా ఎక్సైట్ గా ఫీలయ్యాను. రోమాలు నిక్కపొడుచుకున్నాయని చెప్పాడు. ఆయన ఆ మాట అంటే నాక్కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఆయన నాకిచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది.

అలాగే నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు ప్రౌడ్ గా ఫీలవుతున్నాను అని పవన్ అన్నారు. హీరో అయి ఉండి.. ఆయన ఆ మాట అనటంతో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కథ విని ఆయనకు రాత్రి నిద్రపట్టలేదు. ఆయన ఎంకరేజ్ మెంట్ చూసి నాకు రాత్రి నిద్రపట్టలేదు. చాలా మంది గబ్బర్ సింగ్ తర్వాత నెక్ట్స్ ఏమిటి..ఏ రేంజిలో ఉంటుంది అని అంటున్నారు. డోంట్ వర్రీ...గెట్ రెడీ ఫర్ అక్టోబర్ 18. కెమెరామెన్ గంగతో రాంబాబు అని పూరి చాలా ఎక్సైట్ మెంట్ తో చెప్పారు.

బ్యానర్: యూనివర్సల్ మీడియా
నటీనటులు: పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పూరీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X