ముదురు భామలపై కన్నేసిన పవన్ కళ్యాణ్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంది. పవర్ స్టార్ ఇమేజ్‌తో పాటు... హీరోయిన్ పెర్ఫార్మెన్స్ , గ్లామర్ కూడా సినిమాకు ముఖ్యం కాబట్టి సెలక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పులి, పంజా చిత్రాల్లో కొత్త హీరోయిన్లను ఎంపిక చేసుకున్న పవర్ స్టార్....అవి ప్లాపు కావడంతో కోలుకోలేని దెబ్బతిన్నాడు. అయితే ఈ సారి అలా కాకుండా ఉండటానికి 'ముదురు' భామలపై కన్నేశాడు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంలో కాజల్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపించినా....తాజాగా అనుష్క, నయనతార పేర్లను కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో వీరిలో ఎవరితో రొమాన్స్ చేయడానికైనా రెడీ అని దర్శకునికి పవర్ స్టార్ చెప్పారని పిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రెడీ అవనున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X