ఫ్యాన్స్ లో గందరగోళం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్
రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్, సినిమాలపై మనసు బాగానే పెట్టాడు కానీ ఎన్నుకుంటున్న దర్శకులు, స్టోరీలు మాత్రం అభిమానులకి గందరగోళాన్నే మిగుల్చుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన 'తీన్ మార్" చాలా చప్పగా సాగింది. క్రీస్తు చరిత్రతో తెరకెక్కుతున్న 'ప్రిన్స్ ఆఫ్ పీస్" ప్రశాంతంగా వెళుతుంటే విష్ణువర్థన్ 'కాళీ" కంటికే కనిపించడం లేదు. ఇక 'గబ్బర్ సింగ్" చెప్పాల్సిన అవసరం లేదు.
మొదట్లో క్యారెక్టర్ల విషయంలో చూపించిన స్పీడ్ ప్రాజెక్ట్ పై మాత్రం లేదు. అంతకు ముందు పవన్ చిత్రం చేస్తున్నాడని వార్తరాగానే ఎగిరి గంతులేసే అభిమానులు కూడా ఇప్పుడు అంతగా రియాక్ట్ అవ్వడం లేదు. దీనికి ఉదాహరణ బిందాస్, రగడ చిత్రాల ఫేమ్ వీరుపోట్లతో పవన్ పై చిత్రాల తర్వాత చిత్రం చేస్తున్నాడని వార్త వచ్చినప్పటికీ ఎక్కడా అసలు రెస్పాన్సే లేదు. దీనికి కారణం పవన్ తో చిత్రం కోసం అగ్ర దర్శకులు అందుబాటులో ఉన్నా, వారెవ్వరినీ కాదని ఇలా కొత్తవాళ్లతో చిత్రాలు చేస్తుండటమే. మరి అభిమానలు కోరుకుంటున్న ఆ అగ్ర దర్శకలతో పవన్ ఎప్పుడు సినిమా చేస్తోడో..పవన్ ఫ్యాన్స్ లో మళ్ళీ ఆ జోష్ ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సిందే...


Click it and Unblock the Notifications











