»   »  నేడు ‘వరల్డ్ పవనిజం డే’...ఫ్యాన్స్ సంబరాలు!

నేడు ‘వరల్డ్ పవనిజం డే’...ఫ్యాన్స్ సంబరాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, ఉమన్స్ డే.........వీటి మాదిరిగానే నేటి నుంచి మరో డే మొదలైంది. అదే 'వరల్డ్ పవనిజం డే'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ డేను సృష్టించారు. అక్టబర్ 11వ తేదీని 'వరల్డ్ పవనిజం డే'గా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇదే రోజును ఎందుకు ఎంపిక చేసారంటే....పవన్ కళ్యాన్ నిటించిన తొలి సినిమా అక్టోబర్ 11, 1996లొ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ చేసారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వరల్డ్ పవనిజం డేను సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే శ్రీహరి మృతితో సినీ పరిశ్రమలో విషాద చాయలు నెలకొనడంతో తొలి 'వరల్డ్ పవనిజం డే' పెద్దగా ఆర్భాటాలు, ప్రచారాలు లేకుండా ఎక్కడిక్కడ సింపుల్‌గా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆదర్శంగా 'పవనిజం' కాన్సెప్టుతో సమాజానికి ఏదో ఒక మంచి చేద్దాం అనే ఉద్దేశ్యంతో అభిమానుంలంతా ముందుకు సాగుతున్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూ యువత చెడుదారులు పట్టకుండా ఒక మంచి మార్గంలో నడిచే విధంగా చేయడమే పవనిజం లక్ష్యం.

పవనిజం గురించి ఆ మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.....'పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరిడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని' ఆయన అన్నారు.

English summary
Power Star Pawan Kalyan's fans are celebrating 11th October as the 'pawanism Day'. Pawanism is a pathetic delusional world in which Pawan kalyan's FANS live, who think he his the saviour of masses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu