పవన్ బర్త్‌డే: మేనల్లుడి హడావుడి గాంధీ (ఫోటోస్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆధ్వర్యంలో అభిమానులు గాంధీ ఆసుపత్రి వద్ద హడావుడి చేసారు. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు స్టెచర్ ట్రాలీలను ఆసుపత్రికి విరాళంగా అందించారు. ఇందుకోసం ఆసుపత్రి సూపరిండెంట్ అనుమతి తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలనే లక్ష్యంతో ఈ స్టెచర్ ట్రాలీలను విరాళంగా అందించినట్లు అభిమానులు తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులను సాయి ధరమ్ తేజ్ అభినందించారు. అందరూ సమాజ హితం కోసం పాటు పడాలని సూచించారు.
1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ వయసు 43సంవత్సరాలు. అత్యధిక కలెక్షన్ రేంజ్, భారీ ప్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ తెలుగులో నెం.1 హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. స్లైడ్ షోలో ఫోటోలు....

సాయి ధరమ్ తేజ్
పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గాంధీ ఆసుపత్రికి అభిమానులతో కలిసి వస్తున్న దృశ్యం.

అనుమతి కోసం...
స్టెచర్ ట్రాలీలను డొనేట్ చేయడానికి అభిమానులతో కలిసి సాయి ధరమ్ తేజ్ ఇక్కడికి చేరుకున్నారు.

విరాళం
స్టెచర్ ట్రాలీలను గాంధీ ఆసుపత్రికి అందజేస్తున్న సాయి ధరమ్ తేజ్.

ప్రశంసలు
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విరాళం అందించిన అభిమానులను అభినందిస్తున్న ఆసుపత్రి సూపరిండెంట్.

అభిమానులతో...
అభిమానులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సాయి ధరమ్ తేజ్.


Click it and Unblock the Notifications











