పవన్ ప్యాన్స్ అందుకే భయపడుతున్నారు

By Srikanya

పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రానికి పంజా అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదిలిన సంగతి తెలిసిందే. అయితే పంజా టైటిల్ వినగానే పవన్ ఫ్యాన్స్ గతంలో పవన్ సినిమా పులి కూడా రెండు అక్షరాలే,పి తో ప్రారంభం కావటం, అంతేకాక ఇద్దరూ తమిళ డైరక్టర్స్ కావటం తో ఆలోచనలో పడుతున్నారు. అలాగే పంజా పోస్టర్స్ లో లుక్ చాలామంది సుబ్బరాజు గుర్తుకు వస్తున్నాడనటం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక విష్ణు వర్దన్ మాత్రం ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది. ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్రను పవన్ ఫిక్స్ చేసారు. పవన్ తన సినిమాల్లో మొదటి నుంచి తన పాత్రలకు వెరైటీ పేర్లు పెట్టడం తెలిసిందే. ఖుషీలో సిద్దు..సిద్దార్ద రాయ్ పేరు బాగా పాపులర్ కావటంతో మొన్న తీన్ మార్ లోనూ మైకెల్ వేలాయుధం అనే పేరు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇలా రాబర్ట్ పేరుతో కనపించనున్నాడు. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థల ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం తయారవుతోంది. తమిళంలో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ ఈ చిత్రాన్ని సరికొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నారు. పవన్‌కల్యాణ్ పాత్ర చిత్రణ న్యూలుక్‌తో స్టైలిష్‌గా వుంటుంది. అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇంకా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్‌కోడా, కెమెరా: పి.ఎస్.వినోద్, కూర్పు: ఎం.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, కళ: సునీల్‌ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X