పవర్ చూపలేని ‘పంజా’ఇక ఆశలన్నీ గబ్బర్ సింగ్ పైనే...!?
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పంజా' సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా తరువాత వచ్చిన ఈ సినిమా పై అభిమానులు పెద్ద అంచనాలే పెట్టుకున్నారు. స్టైలిష్ డైరెక్టర్ గా పేరొందిన తమిళ దర్శకుడు విష్ణు వర్థన్ రూపొందించిన ఈ సినిమా అభిమానులపై తన 'పంజా' పవర్ చూపించలేకపోయాడు.
పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా'నిన్న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంటోంది. ఫ్యాన్స్ మాత్రం ఫెర్ ఫార్మెన్స్ హైలైట్ అంటున్నారు. కానీ పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ కి ఎలాంటి ఢోకా లేదని, మరో వారం ఆగితే ఆ విషయం తేలుతుందని అంటున్నారు. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని బట్టే ఈ సినిమా రేంజ్ ఏమిటో తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే హిందీ'దబాంగ్' తమిళ రీమేక్ ఒస్తి ఇటీవల విడుదలై మంచి రివ్వ్యూలను తెచ్చుకంది. సినిమా విజయపథంలో దూసుకువెళుతోంది. ఈ నేపధ్యంలో ఇదే సినిమా తెలుగు రీమేక్ 'గబ్బర్ సింగ్'లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే యేడాది సాలిడ్ హిట్ ని కైవసం చేసుకుంటాడని పవన్ అభిమానలు అంటున్నారు.


Click it and Unblock the Notifications











