»   » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెల్పీ కాంపెయిన్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెల్పీ కాంపెయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. రక్తదానం, అన్నదానం కార్యక్రమంతో పాటు..... మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, మొక్క నాటే సెల్పీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కు మొక్కలు పెంచడం, సేంద్రీయ వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెల్పీ ఫోటోలు పోస్టు చేయడం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతం అవుతుందని, ప్రతి ఒక్కరిలోనూ మొక్కలు నాటాలనే చైతన్యం వస్తుందని భావిస్తున్నారు.

Pawan Fans 'Plant A Tree - Take A Selfie' Campaign

అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు పేరుతో ఆర్భాటాలు ఏమీ చేయవద్దని, వీలైతే సేవా కార్యక్రమాలు చేపట్టండని పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అనవసర ఆర్బాటాలు కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే సేవా కార్యక్రమాలను చేసేందుకు అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.

సెల్ఫీ కాంపెయిన్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సెల్పీల వరద వెల్లువెత్తుందని భావిస్తున్నారు.

English summary
Pawan Fans kickstart 'Plant A Tree - Take A Selfie' Campaign.
Please Wait while comments are loading...