పవన్ అభిమానులు అమీర్‌పేట్

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ అమీర్ పేటలోని సారథి స్టూడియోలో జరుగుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు పవర్ స్టార్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. అయితే అభిమానులను లోనికి అనుమతింక పోవడంతో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న స్టూడియో గొడలు ఎక్కేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫోటోలో ఆ దృశ్యాలు చూడొచ్చు.

భారీగా జనం పోగు కావడంతో అమీర్ పేట చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పవర్ వారికి చెయ్యూపి హాయ్ చెప్పి షూటింగ్‌కు ఇబ్బంది కలిగించవద్దు అనే సంకేతాలు ఇచ్చారు. సెక్యూరిటీ సమస్యల వల్లనే అభిమానులను స్టూడియోలోకి అనుమతించలేదని తెలుస్తోంది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగబోతోంది. షూటింగు కోసం ఇక్కడ సెట్ వేశారు. ఈచిత్రం పవర్ ఫుల్ సబ్జెక్టు, అంతకంటే పరవ్ ఫుల్ డైలాగ్స్ కలగలిపి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ సినిమాగా రూపొందబోతోంది.

ఈ చిత్రంలో పవన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. పవన్ గత సినిమాలకంటే భిన్నంగా ఈచిత్రం రూపొందిస్తున్నారు. అవినీతి రాజకీయ నాయకులపై ఈ చిత్రంలో సెటైర్లు ఉంటాయని తెలుస్తోంది. అదే విధంగా పవన్ అభిమానులు ఆశించే కమర్షియల్ అంశాలపై కూడా దర్శకుడు పూరి ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈచిత్రంలో బ్రెజిల్ భామ గాబ్రియేలా బెర్టాంటె ఐటం సాంగు చేస్తుంది.

అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.

ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X