పవన్ ఫ్యాన్ ‘ప్లాప్’ సెంటిమెంట్ !
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 18న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా హిట్టా? ఫట్టా అని చెప్పడం కష్టమే.
ఈ చిత్రం తప్పకుండా హిట్టవుతుందని నొక్కి వక్కానిస్తూ....పవన్ అభిమానులు కొత్త సెంటిమెంటును తెరపైకి తెచ్చారు. పవన్ కళ్యాణ్ పోలీస్‌గా నటించిన 'పులి' చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. రెండోసారి పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో పోలీస్ గెటప్ వేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసారు.
ఆ మధ్య వచ్చిన 'బంగారం' కళ్యాణ్ మీడియా జర్నలిస్టుగా నించారు. ఆ సినిమా బిలో యావరేజగ్ ఆడింది. ఈ నేపథ్యంలో పవన్ రెండోసారి జర్నలిస్టుగా నటించబోతున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం తప్పకుండా పెద్ద హిట్టవుతుందని, సెంటిమెంటు రిపీట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
పవన్, తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్‌రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











