పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కుట్ర.. థియేటర్ ధ్వంసం
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఇప్పుడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పరువు తీసే పని ఒకటి చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఏర్పాటు చేసి ప్రజలకు ఏదైనా మంచి చేయాలని పవన్ కళ్యాణ్ పరితపిస్తుంటే ఆయన అభిమానులు మాత్రం పరువు తక్కువ పనిచేసి సోషల్ మీడియాలో అందరి చేత తిట్లు తిట్టించుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్ హిట్టుగా....: పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా తొలిప్రేమ అనే సినిమా తెరకెక్కి... అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల వర్షం అప్పట్లోనే కురిపించగా సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 30వ తేదీన ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. చాలా చోట్ల ఈ సినిమాకి మంచి బుకింగ్స్ లభిస్తుండగా విజయవాడలో మాత్రం పరువు తక్కువ పనిచేసి అభిమానులు అందరూ ఇప్పుడు నెటిజనులకు టార్గెట్ అయ్యారు.

థియేటర్ ధ్వంసం: అసలు విషయం ఏమిటంటే విజయవాడ కపర్థి సినిమా థియేటర్ లో నిన్న తొలిప్రేమ సినిమా ప్రదర్శన జరిగింది. ఈ తొలిప్రేమ సెకండ్ షో సమయంలో అభిమానుల పేరుతో బీభత్సం సృష్టించారు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలోనే సినిమా తెర చించేసి, సీట్లు ధ్వంసం చేసిన యువకులు థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టాన్ని కలిగించారు. థియేటర్ ధ్వంసానికి కుట్ర తోనే వచ్చారంటున్న థియేటర్ సిబ్బంది, సినిమా మధ్యలో పది మంది అకస్మాత్తుగా లేచి గొడవ చేశారు అని చెబుతున్నారు.

అభిమానుల పేరుతోనే...: స్క్రీన్ పైకి ఎక్కి కోసేశారు.. సీట్ల పైకి ఎక్కి పీకేశారని, అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి కొట్టారు, సిసి కెమెరాలు, బయట అద్దాలు కూడా ధ్వంసం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు పేరుతో కావాలనే చేశారు అని, నిజంగా అభిమానులు చేశారా అనేది తేల్చాలి అని థియేటర్ యాజమాన్యం చెబుతోంది. రాత్రి జరిగిన ఘటన చూస్తే విధ్వంసం వెనుక కుట్ర ఉందనే అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని థియేటర్ యాజమాన్యం అయితే డిమాండ్ చేస్తోంది.

ఏదైనా కుట్ర జరిగిందా..:ఇటువంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలి అని థియేటర్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అయితే అసలు నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ పని చేశారా ఆయన అభిమానులకు చెడ్డ పేరు కలిగేలా ఏదైనా కుట్ర జరిగిందా అనే విషయం కూడా థియేటర్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. పవర్ కల్యాణం ఇప్పుడు జనసేన పేరుతో యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో బహుశా ఆయనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరి నిజంగా అసలు ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. నిజంగా వారు పవన్ అభిమానుల కాదా అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











