పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మళ్లీ పవర్ స్టార్....సినిమా కోసం దాదాపు సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ అనంతరం పవన్ విదేశీ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. తిరిగి వచ్చిన ఆయన త్వరలో త్రివిక్రమ్ సినిమా షూటింగులో పాల్గొన బోతున్నారు.
ఈ చిత్రానికి 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సమంత హీరోయిన్ గా ఎంపికయింది. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసిన త్రివిక్రమ్.....దాదాపు ఆరు నెలల పాటు షూటింగ్ జరిపేందుకు షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'చోటా మేస్త్రీ'(తాత్కాలిక టైటిల్) కు కూడా కమిట్ అయ్యారు.
ఈ రెండు సినిమాల్లో ఒకే సారి సమాంతరంగా పవన్ నటించేందుకు షెడ్యూల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా థియేటర్లోకి వచ్చే నాటికి దాదాపు మళ్లీ దసరా వస్తుందని, ఆ తర్వాత రెండు మూడు నెలల వ్యవధితో సంపత్ నంది చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం మొత్తానికి 2013లో పవన్ కళ్యాణ్ నుంచి 2 సినిమాలు ప్రేక్షకులు ఆశించ వచ్చు. అయితే పవన్ నెక్ట్స్ సినిమా కోసం దాదాపు మరో 10 నుంచి 12 నెలలు వెయిట్ చేయాల్సిన తప్పని పరిస్థితి.
ఇక పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెలుతోంది. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం 'గబ్బర్ సింగ్' రేంజిని మాత్రం.... పూరి దర్శకత్వంలో వచ్చిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం అందుకోక పోవడం కాస్త నిరాశ పరిచే అంశమే.


Click it and Unblock the Notifications











