పవన్ ..'షాడో', 'కాళీ' రెండూ కాడు
పవన్ కళ్యాణ్, విష్ణువర్థన్ కాంబినేషన్ చిత్రానికి టైటిల్స్ గా 'షాడో','కాళీ' ప్రచారంలో ఉన్నాయి.అయితే ఇవి రెండూ కాదని అంటున్నారు నిర్మాతలు. ఈ విషయమై నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ..'షాడో', 'కాళీ' అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ రెండూ మా సినిమా పేర్లు కావు కావు. మా సినిమా పేరేంటో సెప్టెంబరు 2.. పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రకటిస్తామన్నారు.అలాగే ఇప్పటి వరకూ వచ్చిన పవన్‌కల్యాణ్ సినిమాలకు భిన్నంగా సాగే కథ ఇది. పవన్‌లోని జోష్‌ని కొత్త కోణంలో చూపిస్తున్నాం అన్నారు.సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే రెండు నెలలపాటు ఏకధాటిగా సన్నివేశాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం కేరళ, తమిళనాడుల్లోని పల్లెటూళ్లల్లో షూటింగ్ సాగుతోంది. ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: యువన్ శంకర్ రాజా.


Click it and Unblock the Notifications











