ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్ తో పవన్ ఫుల్ మీల్స్...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'గబ్బర్ సింగ్". సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందిన సూపర్ హిట్ మూవీ 'దబాంగ్" రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే...
ఈ చిత్రం గురించి దర్శకడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'సల్మాన్ ఖాన్ బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా రూపొందిన 'దబాంగ్" హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే..ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి మేనరిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టరైజేషన్ తో ఫుల్ మీల్స్ గా రాబోతున్న సినిమా 'గబ్బర్ సింగ్". పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈచిత్రంలో వుంటాయి. ఫైట్స్ కూడా ఇంతకు ముందెన్నడూ రాని విధంగా కొత్తకోణంలో నావెల్టీగా వుంటాయి అని హరీష్ శంకర్ తెలియజేశారు.
సెప్టెంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఈ చిత్రం హైదరాబాద్, పొల్లాచి, మహాబలేశ్వర్, పంచ్ గని, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఏకధాటిగా జరుగుతుంది దర్శకనిర్మాతలు తెలియజేశారు. పవర్ స్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ జల్సా తర్వాత ఓ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజికల్ హిట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. సో మిరపకాయ్ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న 'గబ్బర్ సింగ్" చిత్రంతో దర్శకుడుగా హరీష్ శంకర్ తన సత్తాను మరోసారి చాటుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications











