పవన్ 'గబ్బర్ సింగ్' విడుదల తేది ఖరారు
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 28 వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పవన్ పంజాని కూడా డిసెంబర్ 9 న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ విషయానికి వస్తే ..పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సీన్ ని డిఫెరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కౌబాయ్ స్టైల్లో నాలుగు వందల షాట్స్ తో ఈ సీన్ చిత్రీకరిస్తున్నారని,అది హైలెట్ గా సినిమాలో నిలవబోతోందని చెప్తున్నారు.ఇక ఈ చిత్రంలో పవన్ చాలా స్టైలిష్ గా పంచ్ డైలాగులో అదరకొట్టి తన అబిమానులను ఆనందింపచేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కంటిన్యూగా యాభై రోజుల షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకున్నారు.
అక్టోబర్ పదవ తేది నుండి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై పోయి కొన్ని పవన్ లేని సీన్స్ షూట్ చేసేస్తున్నారు. ఇక తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది.అక్కడ జాయిన్ అవుతారు పవన్ కళ్యాణ్. యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











