కెవ్వు కేకే ('గబ్బర్ సింగ్' ప్రివ్యూ)
చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ అభిమాలనుకు ఆ కోరిక తీర్చటానికి వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ గబ్బర్ సింగ్ అనే అధికారిగా కనపిస్తాడు. బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఇక్కడ నేటివిటికి తగిన మార్పులు, చేర్పులతో పంచ్ డైలాగులతో మాస్ కి కిక్కిచ్చే పాటలతో తెరకెక్కింది. మిరపకాయతో తన ఘాటుని చూపించిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలీలో పక్కా మాస్ ఎంటర్టనర్ గా తెరకెక్కించారు.
చిత్రం కథలో... కొండవీడు అడ్డాగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతుంటాడు సిద్ధప్పనాయుడు (అభిమన్యుసింగ్). అతని ఆట కట్టించడానికి గబ్బర్‌సింగ్ (పవన్‌కల్యాణ్) అనే ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆ వూరికొస్తాడు. అతనికి కొంచెం తిక్కుంటుంది కానీ దానికీ ఓ లెక్కుంటుంది. సిద్ధప్పనాయుడిని అతను ఎలా అదుపులో పెట్టాడు? భాగ్యలక్ష్మి అలియాస్ బాల (శ్రుతిహాసన్)తో గబ్బర్‌సింగ్‌కి ఎలా పరిచయం ఏర్పడింది? వాళ్ల ప్రేమకథ ఫలించిందా? లేదా? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
దర్శకుడు హరీష్‌శంకర్ మాట్లాడుతూ ''హిందీ చిత్రం 'దబాంగ్'కి రీమేకే అయినా నూటికి నూరుపాళ్లు తెలుగు నేపథ్యంతో తెరకెక్కించాం. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. పవన్‌కల్యాణ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు, వేగేశ్నసతీష్, రమేష్‌రెడ్డిల స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి బలాన్నిస్తాయి. ఈ సినిమాలో శ్రుతిహాసన్ మరింత అందంగా కనిపిస్తుంది''అన్నారు.
ఇక చిత్రం కథలో కానిస్టేబుల్ సాంబ గా అలీ,రికవరీ రంజిత్ కుమార్ గా బ్రహ్మానందం పాత్రలు నవ్విస్తాయి. శృతిహాసన్ కి,పవన్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఫన్నీగ ఉంటాయి. సెకండాఫ్ లో పోలీస్ స్టేషన్ లో పవన్ ఆడే ఆంత్యాక్షరి అయితే సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక దబాంగ్ లో లేని చాలా అంశాలు ఈ చిత్రంలో కనపించి అలరిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కెవ్వు కేక పాట కోసం జనం ధియోటర్స్ వెళతారు.
సంస్థ: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు
ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్
ఎడిటింగ్: గౌతంరాజు
సమర్పణ: శివబాబు.
నిర్మాత : బండ్ల గణేశ్
దర్శకుడు: హరీష్‌శంకర్
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











