పవన్-సంపత్ నంది చిత్రం ఖరారు... పవన్‌కి 50% వాటా!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈచిత్రాన్ని ప్రస్తుత రాజకీయాలు, అవినీతిని ఫోకస్ చేస్తూ రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ అంశాలను కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారు.
గతంలో పవర్ స్టార్ చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన రమణ గోగుల సంగీతం అందించనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ 50% వాటా కలిగి ఉన్నాడట. సంపత్ నంది చెప్పిన స్టోరీలైన్ పవన్ కళ్యాణ్‌కి బాగా నచ్చిందని, వెంటనే ఓకే చేసాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. హీరోయిన్... ఇతర సాంకేతిక వర్గం వివరాలు ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రానికి 'చోటా మేస్త్రీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా వివరాల్లోకి వెళితే... ఈ చిత్రంలో పవన్ సరసన సమంత దాదాపుగా ఖరారైంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











