‘గబ్బర్ సింగ్’ కోసం తిరుమలలో హీరోయిన్ పూజలు
శృతి హాసన్, అనగనగా ఓ ధీరుడు చిత్రం ద్వారా తెలుగులో తెరంగ్రేటం చేసిన ఈ భామ ఆ తర్వాత రెండుమూడు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఇప్పటి వరకు ఆమెకు సరైన క్రేజ్ రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకుంది శృతి. త్వరలో 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శృతి హాసన్ గురువారం తిరుమల వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. ఈ నెల చివరి వారంలో గానీ, ఏప్రిల్‌లో గానీ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది.
శృతి హాసన్ తెలుగులో నటించిన గబ్బర్ సింగ్ చిత్రంతో పాటు, తమిళంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు జోడీగా నటించిన '3' సినిమా కూడా త్వరలో దాదాపు ఒకే నెలలో విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాల ఫలితాలు ఆమె కెరీర్‌ను ప్రభావితం చేసే సినిమాలు కావడంతో తిరుమల వెంకన్నను వేడుకోవడానికి వచ్చింది.


Click it and Unblock the Notifications











