»   » పార్క్ హయత్ హోటల్‌లో పవన్ కళ్యాణ్ బేస్ క్యాంప్

పార్క్ హయత్ హోటల్‌లో పవన్ కళ్యాణ్ బేస్ క్యాంప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం హైటెక్స్‌లో నిర్వహించే సభలో 'జన సేన' పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. సాయంత్రం జరిగే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పార్క్ హయత్ హెటల్‌లో బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుండే ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యవర్గ సభ్యులతో ఆయన పార్క్ హయత్ హోటల్‌లో సమావేశమై ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతున్నారు. నేరుగా ఇక్కడి నుండే సాయంత్రం సభ ప్రాంగణానికి బయల్దేరుతారని సమాచారం. మరో వైపు సభ ఏర్పాట్ల కోసం నియమించిన స్పెషల్ టీం తమ పనులను వేగంగా చేసుకుంటూ వెలుతున్నారు.

Pawan and his close associates base camp

పవన్ మాట్లాడే సభా వేదికను ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి డిజైన్ చేసారు. ఈ సభలో దాదాపు 4 వేల మంది అభిమానులు పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని అభిమానులకు పాసులు కూడా అందజేసారు. పాసులు ఉన్న వారికి మాత్రమే సభలోనికి అనుమతి ఉంటుంది. ఇక్కడి వరకు రాని అభిమానుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు భారీ తెరలు ఏర్పాటు చేసారు. ఈ తెరలపై పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్ ప్రసారం కానుంది.

సభ సాఫీగా సాంగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. భారీ సంఖ్యలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసారు. దీంతో పాటు వందల సంఖ్యలో బౌన్సర్లును కూడా రంగంలోకి దింపారు. ఇప్పటికే అందరూ హైటెక్స్ ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం కానుంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/-eDhOG0GSdg?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Putting an end to all speculations, Power Star Pawan Kalyan, the Baadshah of Tollywood, is officially entering politics this evening (March 14) and launching own political party named Jana Sena Party. The launch event will be held at Novotel Hotel, HITEX, Madhapur in Hyderabad between 6 pm and 8 pm today (March 14). The actor's team has made grand arrangements for this much-hyped function. Pawan Kalyan and his close associates have set up a base camp in Park Hyatt hotel and the actor has been going through each and every aspect of the evening’s program with the team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu