'గబ్బర్ సింగ్'పై పవన్ ఇంటర్వూ (పార్ట్ 1)

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మీడియాకి ఇంటర్వూ ఇచ్చారు. ప్లైట్ లో సాగిన ఈ ఇంటర్వూలో ... యాంకర్ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ చాలా వివరణగా సమాదానమిచ్చారు. ఆ ఇంటర్వూ ఇదే..

కళ్యాణ్ గారూ..గబ్బర్ సింగ్ లాంటి టపోరి, పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేయాలని ఎందుకనిపించింది.

పవన్: చేయాల్సి వచ్చింది(నవ్వుతూ)...ప్రత్యేకించి, చాలా దీర్ఘంగా ఆలోచించి,చాలా పరిశోదించి అని కాదు కానీ, పోలీస్ క్యారెక్టర్ అని చూడలేదు... జనం నా నుంచి ఎంటర్టనర్మెంట్ ఆశిస్తారు. నేను చూసినప్పుడు ఈజీగా ఐడింటిఫై అయ్యాను..అందుకే చేసాను..

ఆ గబ్బర్ సింగ్ అరెవో సాంబా అంటే ..ఈ గబ్బర్ సింగ్ ఏమంటాడు

పవన్: చాలా అంటాడు...చాలా చాలా ఉన్నాయి. అవన్నీ డిజైన్ చెయ్యటానికి, అందరూ నేను ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని ప్రతీవారి మనస్సులో ఉండే అలోచనలన్నిటినీ కలిసి హరీష్ చక్కటి స్క్రీన్ ప్లే చేసాడు. అలాంటి సీన్స్ అన్నిటికీని కలిపి బ్యూటిఫుల్ గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేసాడు.

పవన్: నాక్కొంచెం తిక్కుంది... కని దానికో లెక్కుంది అని హరిష్ గారు వచ్చి చెప్పినప్పుడు...మీకు ఏమనిపించింది.

బేసిగ్గా మీకు కొద్దిగా తిక్క ఉందని బయిట అందరూ అనుకుంటూంటారు అని హరీష్ చెప్పాడు. అదే పెట్టేసాడు. అది విన్నప్పుడు నాకే నవ్వు వచ్చింది.

దేవి శ్రీ ప్రసాద్ అల్టిమేట్ విశ్వరూపం చూపించారు అని ఇండస్ట్రీ లో అంటున్నారు.మీరేమి అంటారు.

పవన్: దేవి ఇండస్ట్రీకి రానప్పుడు ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ నేనే రిలీజ్ చేసాను..మాండలీన్ శ్రీనివాస్ గారి వద్ద ప్రాక్టిస్ చేసినప్పుడు నుంచి తెలుసు..హైలీ ఎనర్జిటిక్ గై...జల్సాకి అతని మ్యూజిక్ కి నేనే సరిగ్గా ప్రెజెంట్ చేయలేనిపించింది.

గబ్బర్ సింగ్ లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి

పవన్: మిగతా పాటలన్ని నచ్చాయి కానీ...కోట గారు పాడిన పాట..అలాగే ఫోక్ మిక్స్ చేసి దేవి చేసిన పాట...కూడా బాగుంది(ఆకాశం అమ్మాయి అయితే...)

శృతి హాసన్ కి యాక్టింగ్ గురించి చెప్తారా

పవన్: ఆమెకు ఇంకా మంచి పాత్రలు రాలేదని అనిపించింది..ఆమె వెరీ గుడ్ ఫెరఫార్మర్..ఆమె ఈ సినిమాలో రెండు మూడు సీన్స్ లో బాగా చేసింది. ఆమె చాలా ఎమోషనల్ వ్యక్తి అని తెలిపేందుకు ఈ సినిమాలో రెండు మూడు సీన్స్ ఉన్నాయి. వాటిలో ఆమె చాలా బాగా చేసిందనిపించింది.

హరీష్ శంకర్ గారి మాటలు నచ్చాయా...డైరక్షన్ నచ్చిందా

పవన్: మన తెలుగు ఆడియన్స్ చాలా ఎంటర్టన్మెంట్ కోరుకుంటారు..అలాగే ఫార్మెట్ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని కొత్తగా చెప్పటం చాలా కష్టం. హరీష్ ..కథని ఎలా ఎడాప్ట్ చేసుకుంటే బావుంటుందో..ఎలా కన్వే చేస్తే బావుంటుందో తెలుసు. అంతకు ముందు కూడా నేను మిరపకాయ చేయాల్సింది కానీ..వేరే కారణాల వల్ల నేను చెయ్యలేకపోయాను..అప్పటి నుంచీ నాకు తెలుసు..అతను ప్రతీ హీరోకి ఎడాప్ట్ అవ్వగలడు..అతని స్కిల్స్ లో డైలాగులు ఒకటే కాకుండా ఒక్కోసారి..కొంతమంది కథను బాగా రాయగలరు..రాసినంత బాగా తెరకెక్కించలేరు..హరీష్ ఎంత బాగా రాయగలడో అంత కన్నా ఇంకా బాగా తెరకెక్కించగలడు..చాలా పాస్ట్ అతను..అతని పేస్ తట్టుకోలేము..సాధారణంగా ఒక షాట్ కోసమో,మరో దాని కోసమో వెయిట్ చేస్తూంటే సహనం చచ్చిపోతుంది..హరీష్ దగ్గర ఆ ఎంతూయాజమ్ అలాగే ఉంటుంది. టైమ్ ని వేస్ట్ చేయడు. అలాగే హరీష్ దగ్గర మెక్యూరి ధింకింగ్ ఉంది. చాలా పాస్ట్ గా ఛేంజి కావాలంటే చేసి చూపించగలడు. అతను కథా పరంగానే కాకుండా తీసే విధానం, అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంది.

చదవండి: 'గబ్బర్ సింగ్‌'పై పవన్ ఇంటర్వ్యూ (పార్ట్ 2)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X