‘పంజా’తో తన మార్క్ ను బయటికి తీసిన పవన్ కళ్యాణ్...!

By Sindhu

తెలుగు సినిమాకి కొత్త పోకడలు నేర్పించి, యువతరం మెచ్చే కథాంశాలతో సినిమాలు మొదలెట్టి యూత్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పదేళ్ల క్రితం తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ చిత్రాలతో విజయఢంకా మోగించాడు. ఆ తర్వాత వరుస పరాజయాలతో కన్ ఫ్యూజన్ కి గురైన పవన్ బంగారం, పులిలాంటి ఎందుకూ కొరగాని చిత్రాల్లో నటించి ప్రేక్షకుల నమ్మకం పోగొట్టుకున్నాడు.

చాలా కాలం తర్వాత పవన్ మళ్లీ పూర్తి స్థాయి ప్రయోగానికి పంజా సినిమాతో పూనుకున్నాడు. రొటీన్ హరోయిజానికి భిన్నంగా కథకి తగ్గ పాత్రలో నటించి పవన్ అభిమానుల మన్ననలు అందుకుంటున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం పంజా చిత్రానికి పెద్ద మైనస్ గా పరిణమిస్తున్నా కానీ పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నమయితే చేసినందకు ప్రశంసలు దక్కుతున్నాయి. పంజా సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా చేసిన ప్రయత్నం(ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చిందనే టాక్) నచ్చి ఆనందంగా వుంది.

అతి ముఖ్యంగా ఏనాడో మానేసిన డాన్సులు వేసి, జానీ తర్వాత ఆపేసిన తన మార్కు ఫైట్లకి మళ్లీ తెర తీసి పవన్ తనలో ఇంకా మునుపటి ఎనర్జీ అలాగే ఉందని చూపించాడు. డాన్సుల్లో మునపటి కంటే కొంచెం ఇప్రూవ్ మెంట్ కనిపిస్తోంది, పవన్ ఎనర్జీ లెవల్ చూస్తుంటే గతంలో బద్రి గుర్తొస్తోంది. సో కూల్ గా చూస్తే గనుక నచ్చే సినిమానే పవన్ కళ్యాణ్ పంజా. పంజా చిత్రం ఫలితం ఎలా ఉన్నా కానీ సగటు 'పవర్' అభిమాని మాత్రం ఈ సినిమా నుంచి సంతృప్తిగా బయటకి వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X