పవన్ కళ్యాణ్ పై మలైకా అరోరా కామెంట్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో మలైకా అరోరా ఐటం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కెవ్వు కేక అంటూ ఆమె వేసిన స్టెప్స్ ఇప్పటికే ప్రోమో రూపంలో అందరినీ అలరిస్తున్నాయి. ఆ షూట్ జరిగినప్పడు తన అనుభవాలను మలైకా మీడియాతో పంచుకుంది. ఆమె ..పవన్ ని దేముడు అంటోంది. అతను ఎక్సట్రీమ్లీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. తను డాన్స్ చేయటానికి వచ్చినప్పుడు ఢిఫెరెంట్ గా ఉంటాడు అనుకన్నాను కానీ ఇంత అవుట్ స్టాండింగ్ ఫెరఫార్మెన్స్ ఇస్తాడనుకోలేదు అంది.
ఇక నాకు తెలుసు పవన్ కి సౌత్ లో దేముడు స్టేటస్ ఉందని,అతనితో కలిసి చేస్తున్నప్పుడు అది ఎందుకో అర్దమైంది. అతను చాలా నిజాయితీగా ఉన్నాడు. చాలా వండ్రఫుల్ హ్యూమన్ బీయింగ్. అతని వద్దకు జనం గుంపులు గుంపులు గా రావటానికి కారణం అతనితో మాట్లాడినప్పుడు అర్దమైంది. తెలుగులో అతను అంత పెద్ద స్టార్ ఎందుకయ్యాడో తెలిసివచ్చింది. ఇక ఈ పాట గురించి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దబాంగ్ మా సొంత ప్రొడక్షన్ చిత్రం. దాని రీమేక్ లో నేను చేసిన పాట మళ్లీ నేనే చెయ్యటం చాలా ఆనందకరమైన విషయం. నిర్మాత గణేష్ బాబు నన్ను చాలా కేర్ గా చూసుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ సెట్స్ పై చాలా కంపర్ట్ గా నన్ను ఉంచారు అంటూ మెచ్చుకొంది.
ఇక గబ్బర్ సింగ్ ఆడియో విషయానికి వస్తే ..ఇప్పటికే ఈ ఆడియో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాటలు సీడిలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మొన్న ఆడియో పంక్షన్ లో సైతం కెవ్వు కేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోనూ పవన్ ఈ చిత్రంలో పాడటం,కోట శ్రీనివాసరావు పాడటం వంటివి జరిగాయి. రేపు విడుదల కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఓ అభిమానిలా ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ కి నచ్చేలా తీర్చిదిద్దానని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. అందరూ చాలా కాలం తర్వాత పవన్ కి వస్తున్న మెగా హిట్ గా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు.
గబ్బర్ సింగ్ లో పవన్ పాత్ర తిక్క ఉన్న పోలీస్ ఆఫీసర్. బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ లో పంచ్ డైలాగులే ప్రాణం. హరీష్ శంకర్ తన మిరపకాయ చిత్రం కూడా డైలాగులతో కొట్టుకొచ్చాడు. అంతటా డైలాగులు బాగున్నాయిని పేరు వచ్చింది. ఈ నేఫధ్యంలో అతన్నే డైరక్టర్ గా ఎన్నుకున్నందుకు పూర్తి న్యాయం చేసి హిట్ కొట్టే దిశలో అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. దబాంగ్ మరోసారి ఖుషీలా పేలుతుందని అభిమానలు ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











