పంజా నిర్మాతగా మారడానికి కారణం పవన్ కళ్యాణే: నీలిమా

By Sindhu

నీలిమ తిరుమలశెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అరుదైన వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంది మహిళా నిర్మాతల్లో ఆమె ఒకరు. పంజా సినిమా తీసిన అనుభవము నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా నిర్మాణం నాకు బహుమానం లాంటింది మరియు చాలా సంతృప్తినిచింది. కానీ కొంత అలసిపోయం. మాకు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం లభించింది. విష్ణు వర్ధన్ అధ్బుతమైన పనితీరు గల నిపుణులలో ఒకడు. సినిమా బాగా రావడానికి ఆయన ఎంతో కృషి చేసారు అంటున్నారు పంజా నిర్మాత నీలిమా తిరుమల శెట్టి.

ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కారణం చెబుతూ...పవన్ కళ్యాణ్ గారి వల్లే నేను సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన తో కలిసి యువ రాజ్యం (ప్రజా రాజ్యం యువజన విభాగం)లో పని చేయడం జరిగింది. ఆయన నన్ను ఎప్పుడు ప్రోత్సహించే వారు. ఆయన కొత్త గా ఒక సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నపుడు నా భర్త అయిన నగేష్ మరియు శోభు మంచి స్నేహితులు అలా శోభు గారితో కలిసి ఈ సినిమా తీయాలని అనుకున్నాం. విష్ణువర్ధన్ స్క్రిప్ట్ మొత్తం చేపినపుడే పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించాలి అనుకున్నాం. ఇంతకముందు చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారితో గడ్డంతో ఒక ఫోటో షూట్ చేసాం నచ్చింది. మీకు సినిమా చూసాక అర్ధం అవుతుంది. అంటున్నా నిర్మాత నీలిమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X