పవన్‌ని బ్లేమ్ చేయలేదు: ఇంటర్వ్యూపై రేణు దేశాయ్ వివరణ

By Bojja Kumar

హైదరాబాద్: నిన్న రేణు దేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో సహజీవనం, ప్రేమ, పెళ్లి, ఇతర అనుభవాల గురించి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్‌ని బ్లేమ్ చేసే విధంగా ఉందనే వాదన తెరపైకి వచ్చింది. దీనిపై తాజాగా వివరణ ఇచ్చారు రేణు దేశాయ్.

‘నేను నా సైడ్ క్లారిఫై చేసాను. నేను ఒక వర్డ్ కూడా కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఆయన్ను బ్లేమ్ చేసేలా మాట్లాడలేదు. మా పెళ్లి, విడాకుల విషయం పక్కన పెడితే ఒక హ్యూమన్ బీయింగ్‌గా ఆయన్ను గౌరవిస్తాను. కానీ డెఫెనెట్లీ నాకు పర్సనల్ పెయిన్ ఉంది. అలా అని ఆయన బ్యాడ్ పర్సన్ కాదు. దయచేసి ఎవరూ దేని గురించి నెగెటివ్‌గా ఆలోచించొద్దు. ఇంటర్వ్యూలో నాపై వచ్చిన తప్పుడు వార్తలపై వివరణ ఇచ్చాను. అంతేకానీ కళ్యాణ్ గారిని బాధ పెట్టడానికో...బ్లేమ్ చేయడానికో కాదు.' అన్నారు.

Pawan is not bad: Renu Desai on Twitter

రేణు దేశాయ్ ఇంటర్య్యూలో చెప్పిన వివరాలు....
నటి, దర్శకురాలు, నిర్మాత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.......ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. తన పిల్లలను నార్మల్ గానే పెంచుతున్నానని, సెలబ్రిటీల పిల్లల్లా ప్రత్యేకంగా పెంచడం లేదు. అప్పుడే వారు రియాల్టీని అర్థం చేసుకుంటారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

18 ఏళ్ల వయసులో బద్రి సినిమా చేయడానికి హైదరాబాద్ వచ్చానని, మొదటి చూపులోనే ఆయన (పవన్ కళ్యాణ్) ప్రేమలో పడ్డానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. తొలుత ప్రపోజ్ చేసింది మాత్రం ఆయనే. నాకు 19 సంవత్సరాలు ఉన్నపుడు పెళ్లి చేసుకున్నాం...అయితే ఇది ఫీషియల్ పెళ్లి కాదు, ఒకరినొకరు ఇష్ట పడి కలసి ఉన్నామని తెలిపారు.

నేను ఆయనతో విడిపోయిన తర్వాత ఆయన నుండి 40 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాలు బయట విని ఆయన నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు. నేను ఆయన నుండి ఎలాంటి డబ్బు తీసుకోలేదు. సన్నిహితులందరికీ ఈ విషయం తెలుసు అన్నారు రేణు దేశాయ్.

తమ మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు. ప్రశాతంగా, సుఖంగా విడిపోయారు. తాము ఎందుకు విడిపోయామనే విషయం నాకు ఆయనకే తెలుసు. భార్యా భర్తల మధ్య ఎవరూ మాట్లాడకూడదను అని పెద్దలు అంటుంటారు....అంటూ దాట వేత ధోరణి ప్రదర్శించారు రేణు దేశాయ్.

19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అయితే అది ఫీషియల్ గా జరుగలేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకు(పవన్ కళ్యాణ్) పెళ్లయింది. ఈ విషయం ఆయన నాకు ముందే చెప్పారు. మొదటి భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉంది...అది ఎంతకాలం అవుతుందో తెలియదు. అందుకే కలిసి సహజీవనం చేసామని రేణుదేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

చాలా మంది ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు మళ్లీ వెనక్కి వెళ్లాలని, ఆయనతో కలిసి ఉండాలని అడుగుతున్నారు. కానీ నేను అలా చేయలేను. అలా చేసి ఆయన్ను ఇబ్బంది పెట్టలేను. ఆయన ప్రైవసీకి భంగం కలిగించలేను. మీరంతా అడుగుతున్నారని బలవంతంగా ఆయన దగ్గరకు వెళ్లడం కుదరదు. మీరు వెళ్లమంటే వెళ్లాలా? అయినా ఎక్కడికి వెళ్లాలి? ఇలాంటి సలహాలు ఇచ్చే వారు కూర్చుని ఆలోచించాలి...అంటూ వ్యాఖ్యానించారు రేణు దేశాయ్.

ఆయనతో కలిసి పదేళ్లకుపైగా జీవించాను. ఇద్దరం కలిసి కాపురం చేసాం. మేము ఎందుకు విడిపోయామనే విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇప్పటికే నేను చెప్పేది ఒక్కటే...నాది హ్యాపీ మ్యారిడ్ లైఫ్. మేము సెలబ్రిటీలం కాబట్టి ఎందుకు విడిపోయామనే విషయం అందరికీ చెప్పాలని కొంత మంది అడుగుతున్నారు. మేము సెలబ్రిటీలం అయినప్పటికీ మాకు పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. మా ప్రైవసీకి గురించి కూడా అందరూ ఆలోచించాలి అన్నారు రేణు దేశాయ్.

ఆయనతో(పవన కళ్యాణ్) విడిపోయిన తర్వాత.....ఒంటరిగా, లోన్లీగా ఎంతకాలం ఉంటావు. మరో పెళ్లి చేసుకోవాలని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. 19 సంవత్సరాలపుడు ఆయన్ను ప్రేమించాను. అమ్మాయి పెళ్లి కాకుండా ఎవరితోనో సహవాసం అంటే అంటే ఎవరి పేరెంట్స్ అయినా బాధ పడతారు. అపుడు మా ఇంట్లో వాళ్లను ఒప్పించాను. అబ్బాయి(పవన్ కళ్యాన్) మంచోడు అని చెప్పి ఒప్పించాను. పరిస్థితి వారికి వివరించాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. అప్పుడే అనుకున్నాను. సచ్చేదాకా ఒకే వ్యక్తితో ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. రెండు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక రోజు ప్రేమించాను, ఈ రోజు ప్రేమించడం లేదు అని చెప్పడం నాకు తెలియదు అన్నారు రేణు దేశాయ్.

నా జీవితం ఇలా ఎందుకయింది అని తెలుచుకుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. లోన్లీగా ఎంత కాలం ఉంటావని అడుగుతున్నారు. అన్నీ అలవాటు చేసుకుంటున్నాను. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నేను ఇపుడు ఖాళీగా ఉండటం లేదు. నాకంటూ పని ఉంది. పిల్లలు ఉన్నారు. కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అన్నారు రేణు దేశాయ్. ఇప్పటికీ ఆయన నాకు మంచి ఫ్రెండుగా ఉన్నారు అని తెలిపారు.

పేరెంట్స్ విడిపోతే పిల్లలపై ఆ ఎఫెక్టు తప్పుండా పడుతుంది. కానీ మా పిల్లల విషయంలో మాత్రం అలా జరుగలేదు. మేమెప్పుడూ గొడవ పడలేదు. మేము విడిపోవడం అనేది విచిత్రంగా జరిగిపోయింది అన్నారు. నా చేతిపై లోటస్ టాటూ చూసి అంతా నన్ను బీజేపీలో చేరుతున్నానేమో అని అనుకున్నారు. కానీ అది నిజంకాదు. నా చేతిపై ఉన్న లోటస్ టాటూ బుద్దిజంకు సంబంధించినది అన్నారు రేణు దేశాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X