Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్‌కు ఆ సినిమాపై ఆసక్తి లేదు
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇటీవల తెలుగు నిర్మాత శరత్ మరార్ కూడా చూసారు. సినిమా బాగుండటంతో పవన్ కళ్యాణ‌్‌ను చూడమని రికమండ్ చేసాడు.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం వార్తలు మరోలా స్ప్రెడ్ అయ్యాయి. శరత్ మరార్ ‘పికె' చిత్రం రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే పవన్ కళ్యాణ్‌ను సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పవన్ కళ్యాణ్ సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించస్తున్న ‘గోపాల గోపాల' చిత్రం హిందీలో హిట్ అయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్. ‘పికె' చిత్రం విడుదలైన తర్వాత సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. పికె చిత్రం సబ్జెక్టు ఓ మై గాడ్ చిత్రానికి దగ్గరగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు.
ఈ రెండు చిత్రాలను పోలుస్తూ బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాస్పదం అయిన చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించరని ఆయన సన్నిహితులు అంటున్నారు.