»   » బ్రహ్మీని టార్గెట్ చేస్తూ పాట పాడిన పవన్ కళ్యాణ్

బ్రహ్మీని టార్గెట్ చేస్తూ పాట పాడిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇటీవల జరిగిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో బ్రహ్మానందం ఓ కామెంట్ చేసారు. అన్నీ పాటలు విడుదల చేసారు కానీ...ఒక సాంగును ఎందుకో ఆపేసారూ అని. విడుదల చేయని ఆ సాంగు ఏమిటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ సాంగులో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని టార్గెట్ చేస్తూ పాడుతాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, బ్రహ్మానందం, అలీ మధ్య అదిరిపోయే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు. స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ చిత్ర స్క్రిప్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 7న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 2న సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతోంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటున్నారు కాబట్టి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Pawan Kalyan is singing a song in ‘Atharintiki Dharedhi’, which is not released in audio function. The song will be a teasing song and Brahmanandam is the target. The movie is being readied for a release on August 7th by producer BVSN Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu