పవన్...కళ్యాణ్..ఆ పేరులోనే ఉన్నాయి వైబ్రేషన్స్....!
పవన్ కళ్యాణ్ 'పంజా' విడుదలకి అన్నీ క్లియర్ అయిపోయాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈచిత్రానికి ఏ సర్టిఫికెట్ దక్కింది. ఫస్ట్ కాపీని తిరుపతి తీసుకెళ్లి పూజలు చేయించి తెచ్చారు. ప్రింట్స్ డిస్పాచ్ కూడా మొదలయింది. రేపు రాత్రికి అనుకున్న ప్రకారం అన్ని చోట్లా ఫ్యాన్స్ షోలు, ప్రీమియర్ షోలు పడిపోనున్నాయి. ఇక ఈ సినిమాపై అభిమానుల అంచనాల్ని పెంచేస్తూ ఈ చిత్ర నిర్మాతలు పూర్తి నమ్మకం వెలిబుచ్చుతున్నారు. అసలు నెగెటివిటికీ స్కోప్ లేకుండా పెద్ద హిట్ కొడుతున్నామనే ధీమాతో ఉన్నారు. సెన్సార్ సర్టిఫికేషన్ జరగగానే అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్స్ ఓపెన్ అయ్యాయి.
ఓ సినిమాలో రాసిన ఈ డైలాగ్ పవన్ విషయంలో నిజంగా నిజమనిపిస్తుంది. నిజంగా పవన్ పేరులో చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. లేదంటే ఎన్ని ప్లాపులొచ్చినా, ఎన్నిసార్లు నిరాశపరచినా కానీ తన ప్రతి సినిమాకీ అదే క్రేజేంటి? పంజా చిత్రానికైతే పబ్లిసిటీ కూడా సరిగా చేయలేదు. ఆడియో అయితే రిలీజ్ చేశారు కానీ సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందన్న సంగతి రిజిస్టర్ చేయడానికి కూడా నిర్మాతలు ప్రయత్నించలేదు. ఎంత లేటుగా మేటర్ పోస్ట్ అయినా కానీ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటుకుంటున్నాడు. చాలా ఆలస్యంగా మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే థియేటర్లని నింపేశాయి. మల్టీప్లెక్సుల బయట జనం బారులు తీరిపోయారు. ఏమాత్రం అంచనాల్ని అందుకున్నా కానీ పంజాతో పవర్ స్టార్ సునామీనే సృష్టించడం ఖాయమని చెప్పేయచ్చు.


Click it and Unblock the Notifications











