twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ పోకడ: ఫ్యామిలీ, ఫ్యాన్స్ కంటే....ఆశయం గొప్ప(ది)దా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటికల్ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలతో పాటు....మెగా ఫ్యామిలీ వర్గాల్లో, మెగా ఫ్యాన్ సర్కిల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి ఊహకు అందని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఆలోచనతో....తొలి షాక్ తగిలింది మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికే అని చెప్పక తప్పదు.

    తను చూపించిన దారిలో నడిచి ఇంత ఎత్తుకు ఎదిగిన తమ్ముడు....తనకు వ్యతిరేకమైన పనులు చేయడం ఆయనకు ఏమాత్రం నచ్చడం లేదు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన బహుషా ఊహించి ఉండరు. అన్నయ్య హోదాలో అజమాయిషీ చూపించాలనే ప్రయత్నంలో తమ్ముడిపై కన్నెర్ర చేసినా......భయపడే స్థితిలో పవన్ కళ్యాణ్ లేక పోవడం ఆసక్తికరం. అన్నయ్య గాండ్రింపులను ఏ మాత్రం పట్టించుకోండా తన తడాఖా చూపించడానికే పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు.

    Pawan Kalyan 'Jana Sena' a real headache for Megastar

    అన్నయ్యను నొప్పించే నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకోవడం రాత్రికి రాత్రికి జరిగింది కాదు. పీఆర్పీ పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసి....అదే పార్టీలో వీలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు అస్సలు నచ్చలేదు. విలీనం తర్వాత వెల్లువెత్తిన విమర్శలను చిరంజీవి చాలా ఈజీగా బూడిద దలుపేసుకున్నట్లు దులిపేసుకుని...ఆయనా కూడా ఆ తానుకు చెందిన రాజకీయనేతనే అని నిరూపించుకున్నాడని కొందరు మండి పడ్డారు.

    కానీ ముక్కుసూటి మనస్తత్వం, కశ్చితత్వం, అభ్యుదయ భావాలు, ప్రజల కోసం ఏదైనా చేయాలనే ధృఢ నిశ్చయంతో ఉన్న పవన్ కళ్యాణ్....అన్నయ్య తీరుతో ఏకీభవించలేక పోయాడు. మార్పు తెస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి మార్పు తేకపోగా తానే మారిపోవడంతో....తమ్ముడు పవన్ కళ్యాణ్ మనసు తట్టుకోలేక పోయింది.

    దీనికి తోడు రాష్ట్రంలో రోజు రోజుకు రాజకీయ పరిస్థితులు దిగజారి పోవడం, స్వలాభం కోసం కాకుండా ప్రజల మేలు కోసం పోరాడే నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న తరుణంలో........ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇదే సరైన సమయం అని నిర్నయించుకున్న పవన్ కళ్యాణ్, సన్నిహితులు, అభిమానులు ప్రోత్సాహంతో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.

    పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప అని ఓ కవి చెప్పినట్లు.........రాజకీయ పార్టీ పెట్టి ఈ కుళ్లి పోయిన వ్యవస్థను మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏమో..? అన్నీ అనూకూలిస్తే తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ పార్టీ ద్వారా ఈ కుళ్లు వ్యవస్థ నుండి విముక్తి లభిస్తుందేమో?

    ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎన్నో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయిన వాళ్లు, అభిమానులను ఆయనకు దూరం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయాలు తీసుకుంటే మాకు సంబంధం లేదని మెగా బ్రదర్ నాగబాబు, రామ్ చరణ్ ప్రకటించారు. మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు చిరంజీవి వెంటే అని తేల్చి చెప్పారు.

    అయితే పవన్ కళ్యాణ్ వీటన్నింటికీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్న లక్ష్యం, ఆశయం వీటన్నింటికంటే గొప్పది, ఉన్నతమైనదని ఆయన నమ్ముతున్నారు. కుటుంబం కంటే రాష్ట్రం, దేశం గొప్పది అని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. మరి లక్ష్య సాధనలో పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో వెయిట్ అండ్ సీ....

    English summary
    Pawan’s decision to start his own Party is turning out to be a real headache for the Mega family. As a Union Minister, Chiru would have to explain to the high command as to why he could not prevent his own brother from creating hurdles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X