ఈ రోజు పవన్ కళ్యాణ్ కెవ్వు కేక...

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు(ఏప్రిల్ 18) గబ్బర్ సింగ్ ఐటం సాంగ్ 'కెవ్వు కేక' షూటింగులో పాల్గొననున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని విశాల స్థలంలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్, బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరా, దాదాపు 100 మంది డాన్సర్స్‌తో భారీ ఎత్తున ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాస్ ట్యూన్స్‌తో కేకపెట్టించేలా రూపొందించారు.

కాగా..గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పవర్ స్టార్ నిన్న పూర్తి చేశారు. అక్కడ పని పూర్తవ్వగానే పాట చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పాటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కోరుకున్న విధంగా ఔట్ పుట్ వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఆడియోలో కెవ్వుకేక పాటే హైలెట్‌గా నిలవడంతో సినిమాలో విజువల్ పరంగా కూడా ఈ పాట దుమ్ము రేపేలా, మాస్ జనాలను థియేటర్ల వైపు లాక్కొచ్చేలా ఉండాలని ట్రై చేస్తున్నారు. నిర్మాత గణేష్ బాబు కూడా ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా దర్శకుడికి స్వేచ్చనిచ్చినట్లు యూనిట్ వర్గాల సమాచారం.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X