పులి పై పవన్ హామీ

ఇక అదే సమయంలో తన సోదరుడు చిరంజీవి తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు.చిరంజీవి పరాజయం పొందుతారంటూ వచ్చిన సర్వేల గురించి ప్రస్తావిస్తే అదేం లేదని ఇంతకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పాయి..కానీ ఏమయ్యింది..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..ఇప్పుడు అలాగే జరుగుతుంది..వాటిని నమ్మాల్సిన పనిలేదు అన్నారు...అలాగే రేపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినా తను సినిమాల్లో నటిస్తూనే ఉంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.
ఇక ఈ చిత్రం ఇప్పటివరకూ దాదాపు డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. మరో ప్రక్క ఎడిటింగ్ కార్యక్రమాలు సైతం సైమన్టైనస్ గా చేస్తున్నారు. షూటింగ్ ఫినిష్ కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదంటున్నారు యూనిట్ వర్గాలు. ఇక ఖుషి చిత్రం కాంబినేషన్ రిపీట్ అవుతున్న చిత్రం కావటంతో దీనిపై పరిశ్రమలోనే కాక బయిట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు పవన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయటం, ఎ.ఆర్.రహ్మాన్ సంగతం మరింత క్యూరియాసిటీని లేపుతున్నాయి.
ఇక పవన్ డేట్స్ సర్దుబాటుని బట్టి బ్యాలన్స్ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి, ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనేది దర్శకనిర్మాతల ఆలోచన. అలాగే ఈ చిత్రంలో పవన్ కు జోడిగా నిక్కిషా పటేల్ (తొలి పరిచయం), ప్రతినాయక పాత్రలో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, మిగతా పాత్రల్లో శరణ్య, నాజర్, ఆలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్ అందిస్తున్నారు. పవన్ కెరీర్ లో ఇది ఓ సంచలన చిత్రం అవుతుందని అంతా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











