పవన్ కళ్యాణ్‌కు ‘ఇండియా టుడే’ అరుదైన గౌరవం
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. ప్రముఖ జాతీయ మేజగైన్ 'ఇండియా టుడే' వారు పవన్ కళ్యాణ్‍పై 120 పేజీల స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేయబోతోంది. 'పవర్ ఫుల్ స్టార్-స్మైల్ అండ్ స్మార్ట్ స్టార్' అనే శీర్షికతో ఈ స్పెషల్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేగజైన్లో పవన్ కళ్యాణ్ గురించిన పూర్తి సమాచారం ఉండనుంది. ఆయన ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా ఇందులో పొందు పరచనున్నారు. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫోటోలతో ఈ స్పెషల్ ఎడిషన్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఇందులో పవన్ కళ్యాణ్‌ను...చిరంజీవితో పాటు ఇతర టాప్ స్టార్లతో పోలుస్తారని తెలుస్తోంది. గతంలో ఇండియా టుడే చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబులపై ఇలాంటి స్పెషల్ ఎడిషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు పవన్ కళ్యాణ్‌పై కూడా స్పెషల్ ఎడిషన్ విడుదల చేస్తుండటం చర్చనీయాంశం అయింది.

ఇటీవల 'అత్తారింటికి దారేది' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ .....ప్రస్తుతం 'గబ్బర్ సింగ్ 2' చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











