»   » పవన్ కళ్యాణ్ పర్సనల్, ప్రొఫెషనల్..... ఆ రెండూ కేవలం రూమర్లే!

పవన్ కళ్యాణ్ పర్సనల్, ప్రొఫెషనల్..... ఆ రెండూ కేవలం రూమర్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటుడికి స్టార్ ఇమేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అతడికి చుట్టూ అంత ఎక్కువగా రూమర్స్. అటు పర్సనల్ అంశాల్లో, ఇటు ప్రొఫెషనల్‌గా ఇలాంటివి కామన్. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

పర్సనల్ అంశాల గురించి మాట్లాడుకుంటే... పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో శరత్ మరార్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇపుడు ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయనే ఫిల్మ్ నగర్ టాక్.

అవి కేవలం రూమర్స్

అవి కేవలం రూమర్స్

కాటమరాయుడు సినిమా రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్-శరత్ మరార్ కలిసి కనిపించక పోవడంతో ఈ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటమే కలుసుకోకపోవడానికి కారణమని అంటున్నారు.

Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price
పవన్ కళ్యాణ్ అలాంటోడు కాదు

పవన్ కళ్యాణ్ అలాంటోడు కాదు

పవన్ కళ్యాణ్, శరత్ మరార్ మధ్య విబేధాలకు దారి తీసేంత పెద్ద విషయాలు ఏమీ లేవని, సినిమా అన్నాక లాభాలు, నష్టాలు సర్వసాధారణం. ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్-శరత్ మరార్ మధ్య విబేధాలు వచ్చే అవకాశమే లేదని, పవన్ కళ్యాణ్ స్నేహాన్ని అంత త్వరగా వదులుకునే రకం కాదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ప్రొఫెషనల్‌గా

ప్రొఫెషనల్‌గా

పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.....ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన తన 25వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంజనీర్ బాబు, గోకుల కృష్ణుడు లాంటి టైటిల్స్ ప్రచారంలోకి రాగా, తాజాగా ‘దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ తెరపైకి వచ్చింది.

ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు.

ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు.

అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదని, అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు రూమర్స్ నమ్మ వద్దని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. త్వరలోనే అఫీషియల్ పోస్టర్, టైటిల్ లోగో రిలీజ్ అవుతుందని తెలిపారు.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ తన గత సినిమాకు భిన్నమైన కాన్సెప్టుతో, పూర్తి కమర్షియల్ వ్యాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
PK25 team gave clarity that all these titles are just rumours and they have not finalised any of these titles. They are saying that they have not even considered a single title for this film till now. They are asking the fans to wait for the official announcement of the title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu