14 యేళ్ళలో 14 సినిమాలో ప్రతీ సినిమాలో ఏదోఒక సందేశం: దట్ ఈజ్ పవన్

By Sindhu

సినీ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టి ఈ రోజుతో 14 యేళ్ళు అవుతోంది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" చిత్రం ద్వారా హీరోగా రంగప్రవేశం చేసాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా 1996లో అక్టోబర్ 11వ తారీఖున విడుదలయ్యింది. అంటే కరెక్ట్ గా నేటికి 14యేళ్ళు పూర్తయింది. ఈ 14 యేళ్ళ కెరీర్ లో పవన్ 14 సినిమాలు చేశాడు. ఇవి కాకుండా 'శంకర్ దాదా యంబిబియస్" చిత్రంలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. 'జాని చిత్రానికి దర్శకత్వం వహించాడు. మెగాస్టార్ తమ్ముడిగా కెరియర్ ఆరంభించిన పవన్ కళ్యాణ్ 1998 విడుదలైన 'తొలి ప్రేమ" చిత్రంతో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తొలిప్రేమ సినిమా తర్వాత పవన్ కి కుర్రకారులో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అప్పట్నుంచి తనదైన శైలిలో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాడు.

హీరోగా మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ తనలో ఉన్న టెక్నీషియన్ల ను 'జానీ" ద్వారా వెలికి తీశాడు. ఈ చిత్రానికి దరక్శకత్వం వహించాడు. ఆర్థికంగా విజయం సాధిచకపోయినప్పటికీ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ లో ఉన్న ప్రతిభ ఉందని నిరూపించింది 'జాని". ఈ చిత్రంలో తన ప్రేయసి రేణు దేశాయ్ కథానాయికగా పవన్ నటింపజేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్లు వీళ్లిద్దరూ సహజీవనం కూడా చేశారు. అనంతరం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

అంతే కాకుండా పవన్ కి సామాజిక స్పృహ ఉంది. అందుకే తన సినిమాల్లో దేశభక్తికి సంబంధించిన పాటనో, సందేశాన్నో ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇటీవల విడుదలైన 'కొమరం పులి" లో కూడా సామాజిక స్పృహకు సంబంధించిన సందేశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జయంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఖుషీ" గా చిత్రంలో నటిస్తున్నాడు. జల్సా తర్వాత 'కొమరం పులి"కి చాలా సమయం పట్టినందుకు ఇక నుంచి అలా జరగకూడదని, వరుసగా సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ 14ఏళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆయన కెరీర్ మరింత విజయవంతంగా కొనసాగాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X