ఫుల్ డిమాండ్: పవన్ కళ్యాణ్ ఫోటోలతో క్యాలెండర్లు

By Bojja Kumar

హైదరాబాద్: 2015 సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొత్త క్యాలెండర్ల సందడి మొదలైంది. సినిమా రంగానికి చెందిన పవన్ కళ్యాణ్, బాలయ్యలకు చెందిన క్యాలెండర్లను అభిమానులు తయీరు చేయిస్తున్నారు. ఇటీవల బాలయ్య లెజెండ్ ఫోటోలతో క్యాలెండర్లు అచ్చువేయించగా, తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటోలు, జనసేన పార్టీ లోగోలతో క్యాలెండర్లు కూడా రెడీ అయ్యాయి.

ఇక పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల' విషయానికొస్తే...
ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు.

 Pawan Kalyan 2015 Calendar Pic

అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X