పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి పూర్తి వివరాలు (ఫోటోలతో)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్న విషయం అధికారికంగా ఖరారైంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ బసిత్ సిద్ధిఖి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరూ పెళ్లికి అప్లై చేసారని, కొంత కాలం వారి పేర్లు నోటీసు బోర్డులో పెట్టామని, ఎలాంటి అభ్యంతరాలు లేక పోవడంతో పెళ్లిని రిజిస్టర్ చేసామని బసిత్ సిద్ధిఖి తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్నది...తీన్ మార్ చిత్రంలో నటించిన భామ అని అంతా అనుకున్నారు. కానీ ఆయన వివాహం చేసుకున్నది ఆమెను కాదు. అన్నా లెజెనివా అనే విదేశీ అమ్మాయిని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్న పవన్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ పెళ్లికి ఆయన సన్నిహితులు ఒకరిద్దరు మినహా ఎవరూ హాజరు కాలేదు.
పవన్ కళ్యాణ్ విదేశీ భామతో సహజీవనం చేస్తున్నట్లు గతంలో కొన్ని పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలపై అప్పట్లో పెద్ద దుమరాం రేగింది. పవన్ సన్నిహితులు కొందరు ఇవన్నీ అబద్దపు వార్తలపై వార్తలంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. అయితే పవన్ మాత్రం స్పందించలేదు.
కానీ ఆ పుకార్లే ఇపుడు నిజం అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడు...ఇప్పుడు మీడియాలో వార్తలను పట్టించుకోకుండా తన పనితాను చేసుకుంటూ వెలుతున్నాడు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి విషయం నిజమని తేలడంతో అభిమానులు, ప్రేక్షకులు అవాక్కయ్యారు.
పవన్ కళ్యాణ్ తొలుత నందిని అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమెను విడాకులు తీసుకున్న పవన్ 'బద్రి' సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేసి పిల్లలను కన్నాక ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి అకీరా నందన్, ఆద్యా అనే ఇద్దరు సంతానం. ఇప్పుడు రేణుతో సైతం విడిపోయి అన్నా లెజెనివాను మూడో వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్-అన్న లెజెనివా
పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్న లెజెనివా ఫోటో. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని, సహజీవనం చేసిన ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు.

మ్యారేజ్ సర్టిఫికెట్
హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ ఆఫీసులో పవన్ కళ్యాణ్, అన్నా లెజెనివా వివాహంపై జారీ అయిన సర్టిఫికెట్

ఇద్దరూ అప్లై చేసారు
ఇద్దరూ పెళ్లికి అప్లై చేసారని, కొంత కాలం వారి పేర్లు నోటీసు బోర్డులో పెట్టామని, ఎలాంటి అభ్యంతరాలు లేక పోవడంతో పెళ్లిని రిజిస్టర్ చేసామని బసిత్ సిద్ధిఖి తెలిపారు.

మీడియాతో మాట్లాడిన సబ్ రిజిస్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్న విషయం అధికారికంగా ఖరారైంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ బసిత్ సిద్ధిఖి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











