»   » పవన్ కళ్యాణ్ మూడో పెళ్లికి సాక్ష్యాలివే!

పవన్ కళ్యాణ్ మూడో పెళ్లికి సాక్ష్యాలివే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి గురించి గత కొంత కాలంగా మీడియాలో చర్చ సాగుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న పవన్ కళ్యాణ్...తీన్‌మార్ సినిమాలో తనతో కలిసి నటించిన విదేశీ నటి, ఆస్ట్రేలియా మోడల్ డనా మార్క్స్‌ను మూడో వివాహం చేసుకున్నారనేది ఆ వార్తల సారాంశం.

అయితే ఇంతకాలం ఈ వార్తలు కేవలం ఆదారాలు లేని వార్తలుగానే ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ మూడో వివాహానికి సంబంధించిన ఆధారాలు సైతం బయటకు వచ్చాయి. సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి జరిగినట్లు పలు పత్రికలు, టీవీ ఛానల్స్‌లో వెలువడ్డాయి. వీరికి ఓ ఆడపిల్ల కూడా పుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్ 30న వీరిద్దరూ రిజిస్టర్ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేసి రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారని, రికార్డుల ప్రకారం నోటీస్ నెంబర్ 50, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 43లో వీరి పెళ్లి నమోదయిందని, ఈ పెళ్లికి సాక్షులుగా ముగ్గురు వ్యక్తులు సంతకాలు చేశారని, వారు.. బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ హనీఫ్, రాజీవ్‌నగర్‌కు చెందిన ఎన్.శ్రీనివాస్, ఫిలింనగర్‌కు చెందిన బి.ఆనందంగా పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.

పవన్ కళ్యాణ్...ఆయన రెండో భార్య రేణు దేశాయ్ గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. డనా మార్క్స్‌‌తో పవన్ కళ్యాణ్ ఎఫైర్ కారణంగానే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కు దూరమైందని.....ఆ తర్వాత డనా మార్క్స్‌‌తో పవన్ కళ్యాణ్ తన లైఫ్ కంటిన్యూ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

English summary

 Pawan Kalyan's 3rd Marriage with Australian Model Dana Mark news confirmed. Recently, One of the Popular News Paper published this news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu