నిహారిక పెళ్లికి రేణూ దేశాయ్ డుమ్మా.. అకీరా ఆద్యలతో పవన్ కళ్యాణ్ రచ్చ
ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ అంతా నిహారిక పెళ్లి గురించే. మెగా అల్లు ఫ్యామిలీలు చేసే సందడి, బయటకు వస్తున్న ఫోటోలు ఇలా నిహారిక పెళ్లి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. అయితే ఇంత హంగామా జరుగుతూ ఉంటే అందరి కళ్లు ఒక్కరి కోసం ఎదురుచూడసాగాయి. నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెళ్లికి వెళ్తాడా? లేదా? అని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్..
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. నిహారికను పెళ్లి కూతురుని చేసే ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. కేవలం చిరంజీవి మాత్రమే వచ్చాడు. ఆ వేడుకల్లో పవన్ కళ్యాణ్ వస్తాడని అందరూ భావించారు. కానీ ఎక్కడా కనిపించలేదు.

రైతుల సమస్యలు..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నాడు. వర్షం వల్ల దెబ్బతిన్న రైతుల పంటలను, వరద ప్రభావిత ప్రాంతాలను, రైతులను సమస్యలను వింటూ పర్యటిస్తున్నాడు. అందుకే నిహారిక పెళ్లిలో అంతగా కనబడటం లేదని నేరుగా పెళ్లికే వెళ్తారని అందరూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే నిజమైంది.

పిల్లలను తీసుకుని..
పవన్ కళ్యాణ్ తన పిల్లలు ఆద్య, అకీరాలను తీసుకుని ఉదయ్ పూర్‌కు వెళ్లాడు. స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లిన పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే ఉదయ్ విలాస్ ప్యాలెస్‌కు చేరుకున్నాడు. అయితే ఎయిర్ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్, ఆద్య, అకీరాలు కంటపడటం ఆ ఫోటోలు బయటకు రావడంతో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

రేణూ దేశాయ్ అలా..
నిహారిక పెళ్లి వేడుకల్లో రేణూదేశాయ్ కూడా పాల్గొంటుందని టాక్ వినిపించింది. కానీ రేణూదేశాయ్ పెళ్లికి వెళ్లేలా లేదనిపిస్తోంది. ఎందుకంటే నేడు రేణూదేశాయ్ తన కొత్త వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభించింది. అలా షూటింగ్‌లో రేణూ దేశాయ్ బిజీగా ఉండటంతో.. పిల్లలను వారి తండ్రితో పంపించినట్టు తెలుస్తోంది.
వారం రోజుల నుంచి..
డిసెంబర్ 9న జరిగే నిహారిక పెళ్లికి వారం ముందు నుంచే సంబరాలు మొదలయ్యాయన్న సంగతి అందరికీ తెలిసిందే. హైద్రాబాద్‌లో నాగబాబు ఇంట్లో ఈ వేడుకలు అంగ రంగ వైభవంగా భారీగానే జరిగాయి. ఇక రేపు రాత్రి ఈ జరిగే వివాహానికి దాదాపు అందరూ విచ్చేసినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











