నన్ను క్రిమినల్‌లా చూసారు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌గా ముద్ర పడిపోయిన సినిమా ‘జానీ'. ఈచిత్రానికి పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వం వహించారు. సినిమా ప్లాపు కావడంతో పవన్ కళ్యాణ్ ఎంత మనోవేదనకు గురయ్యారో....డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల నుండి ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జయాపజయాల్ని ఎప్పుడూ పట్టించుకోను. రెండింటికీ అతీతంగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. సినీ పరిశ్రమలో పరిస్థితులు అత్యంత వేగంగా మారి పోతుంటాయి. హిట్టయితే అందలం ఎక్కిస్తారు. ప్లాపయితే తిడతారు. ‘జానీ' సినిమా నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ సినిమా ప్లాపయిన తర్వాత కొందరు నన్ను క్రిమినల్ ను చూసినట్లు చూసారు. ఒక్క ప్లాపుతో మనుషులు ఇలా మారి పోయారేంటి? అనిపించింది. అప్పటి నుండి హిట్టు, ప్లాపులకు ఒకేలా స్పందించడం అలవాటు చేసుకున్నాను అన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇటీవల విడుదలైన ‘గోపాల గోపాల' సినిమా కథతో సురేష్ బాబుగారి కంటే ముందే చాలా మంది వచ్చారు. ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తాం, మీరు నటించాలని అడిగారు. కృష్ణుడి పాత్ర అనగానే భయం వేసింది. నీలిరంగు, నెమలి పించం గుర్తొచ్చింది. నేను కృష్ణుడి గెటప్ వేస్తే కామెడీగా ఉంటుందని ఒప్పుకోలేదు. సురేష్ బాబు గారు వచ్చి ఇది పాత కృష్ణుడి పాత్ర కాదు...మోడ్రన్ కృష్ణుడి పాత్ర అని తెలియడంతో ఒప్పుకున్నాను అన్నారు.
సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సురేశ్, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మించిన ‘గోపాల గోపాల' చిత్రానికి కిశోర్‌కుమార్ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.


Click it and Unblock the Notifications











