twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాగి పిచ్చి వేషాలు వేస్తూ అమ్మాయిల జోలికొస్తే మక్కెలు ఇరుగుతాయ్: పవన్ కళ్యాణ్

    |

    జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. కడపలో విద్యార్థులతో భేటీ అయిన సందర్భంగా సంపూర్ణ మద్య నిషేధం గురించిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. మద్యం వల్ల యువత నాశనం అవుతోంది, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని, దీన్ని నిషేధించాలని అని కోరగా పవన్ కళ్యాణ్ స్పందించారు.

    మొన్న తూర్పుగోదావరి జిల్లాలో మీటింగ్ పెట్టాను. సంపూర్ణ మద్య నిషేదం పెడతాను అనగానే వెనకాల నుంచి కొందరు వ్యక్తులు వద్దు వద్దు అంటూ చేతులు ఊపారు. నాకు నువ్వంటే ఇష్టం కానీ మద్యం షాపులు బ్యాన్ చేయొద్దని చెప్పే ప్రయత్నం చేశారని.. పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

    కఠినమైన చట్టాలు ఉండాలి

    కఠినమైన చట్టాలు ఉండాలి

    చాలా మందిని నేను మద్యం నిషేదం గురించి అడిగాను. ఇదే మధ్యం షాపులు విదేశాల్లో ఉంటాయి. యూరఫ్ వెళితే ఏ మూలకు వెళ్లినా బార్ ఉంటుంది. కానీ వారు మద్యం తీసుకుని రోడ్డు మీదకు ఎక్కాలంటే, డ్రైవింగ్ చేయాలంటే వణికిపోతారు. పోలీసులకు దొరికితే లైఫ్ టైమ్ వారికి డ్రైవింగ్ చేయడానికి వీల్లేకుండా చేస్తారు. ఆన్ డ్యూటీ దొరికితే ఉద్యోగాల్లో నుంచి తీసేస్తారు. అంత కట్టుదిట్టమైన చట్టాలుంటాయని చెప్పారు.

    బెల్టు షాపులు బ్యాన్ చేస్తాం

    బెల్టు షాపులు బ్యాన్ చేస్తాం

    మరికొంత మంది.. నువ్వు ఏం తాగావన్నది కాదు.. ఏం చేశావన్నది, ఏం మాట్లాడావన్నది ముఖ్యం అంటూ మరో లాజిక్ చెబుతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బెల్టు షాపులను కంప్లీగ్‌గా బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చాను. దీన్ని నేను మనస్పూర్తిగా పాటిస్తాను.

    ఒక్కరోజులో అద్భుతాలు జరుగవు, నాకు చేతనైంది చేస్తాను

    ఒక్కరోజులో అద్భుతాలు జరుగవు, నాకు చేతనైంది చేస్తాను

    ఒక్క రోజులో నేను చాలా చేసేయగలను అని మీరందరూ నా నుంచి ఎక్కువ అద్భుతాలు ఆశించవచ్చేమో? కానీ మీ బాధను, వేదనను అర్థం చేసుకోగలను. నాకు చేతనైంది కచ్చితంగా చేస్తాను. అందులో భాగంగా బెల్టు షాపులను నిషేధించడం తప్పకుండా చేస్తాను.

    పూర్తిగా బ్యాన్ చేస్తే కొత్త సమస్యలు

    పూర్తిగా బ్యాన్ చేస్తే కొత్త సమస్యలు


    పూర్తిగా బ్యాన్ చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. పక్కరాష్ట్రాల్లో మన కంట్రోల్ ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి మద్యం వస్తుంది. దాని వల్ల కొత్త మాఫియా వస్తుంది. రౌడీలు వస్తారు, దానికో మార్కెట్ తయారవుతుంది. ఎన్టీ రామారావుగారు మద్య నిషేదం పెట్టినపుడు కొంత మంది సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఏరియాకు వెళ్లి ఆర్మీవాళ్లు ఇస్తారేమో అని ఎదురు చూసేవారు. బంగారం స్మగ్లింగ్, ఆర్డీఎక్స్ స్మగ్లింగ్ మాదిరిగా చేసేవారు. అందుకే కంప్లీట్ నిషేదం అనేది సాధ్యపడక పోవచ్చు.

    తాగి పిచ్చి వేషాలు వేస్తూ అమ్మాయిల జోలికొస్తే మక్కెలు ఇరుగుతాయ్

    తాగి పిచ్చి వేషాలు వేస్తూ అమ్మాయిల జోలికొస్తే మక్కెలు ఇరుగుతాయ్

    మా నాన్న ఆబ్కారీ శాఖలో పని చేసిన వ్యక్తి. నాకు ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకుని రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరైనా తాగి పిచ్చిగా రోడ్ల మీదకు వస్తే జైల్లో పెట్టడం లాంటి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉండాలి. ఆడ పిల్లల జోలికి వస్తే తిరిగి మాట్లాడకుండా, బయటకు రాకుండా తన్నిలోపల వేయాలి. తాగితే తాగు.. ఇంట్లో ఏమన్నా చేసుకో. బయటకు వచ్చి పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు ఇరగ్గొడతాం. అలాంటి బలమైన చట్టాలు తేవాలి. అలాంటి బలమైన చట్టాలు తెచ్చిన తర్వాతే నేను మద్యం గురించి మాట్లాడతాను. ఇది నేను మీకు ఇచ్చే భరోసా.. అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    English summary
    "It is not possible to complete ban, should Find the correct solution." Pawan Kalyan about Alcohol Ban.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X