twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వదిన డబ్బులిస్తే పుస్తకాలు కొనుక్కునే వాడిని.. అది ఎబ్బెట్టుగా అనిపించేది.. పవన్ కళ్యాణ్ కామెంట్స్

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరోలందరిలోనూ ప్రత్యేకమైన వారు. హంగులకు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ మామూలుగా ఏ ఈవెంట్లకూ రాడు. తన సొంత సినిమా ఫంక్షన్లలో కూడా మాట్లాడేందుకు అంత సుముఖత చూపించరు. అయితే ఇక అంతటి పవర్ స్టార్ బర్త్ డే వేడుకలు అంటే ఏరేంజ్‌లో సెలెబ్రేట్ చేసుకోవాలి.. ఫ్యాన్స్ ఎలా సెలెబ్రేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం అలాంటివేవీ నచ్చవు. తాజాగా ఇదే విషయమై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    బర్త్ డే సెలెబ్రేషన్స్..

    బర్త్ డే సెలెబ్రేషన్స్..

    మామూలుగా తమ అభిమాన హీరోల బర్త్ డేలు అంటే అభిమానులకు పండుగలాంటిది. అందులోనూ దేవుడిలా ఆరాధించే పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే హంగామా ఇంకెంత రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బర్త్ డే సెలెబ్రేషన్స్‌ను బయట కాకుండా సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేస్తున్నారు.

    ముచ్చటగా మూడు..

    ముచ్చటగా మూడు..

    పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు (సెప్టెంబర్ 2) అదిరిపోయే అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. వకీల్ సాబ్ టీజర్ ఉదయం 9 గంటల 9 నిమిషాలకు, క్రిష్ సినిమా అప్డేట్. మధ్యాహ్నం 12 30 గంటలకు, హరీష్ శంకర్‌తో చేయబోయే ప్రాజెక్ట్ అప్డేట్ సాయంత్రం 4 గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ కానుంది. ఇక ఈ మూడు అప్డేట్స్‌తో పవన్ ఫ్యాన్స్ దుమ్ములేపబోతోన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన బర్డ్ డే సెలెబ్రేషన్స్, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

    స్కూల్లో చాక్లెట్స్..

    స్కూల్లో చాక్లెట్స్..

    బర్త్ డే వేడుకలు జరుపుకోవడంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సెలెబ్రేట్ చేసుకోకపోవడానికి ప్రత్యేకించి కారణాలు లేవని చెబుతూ.. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. ఒకటి రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్స్ పంచినట్టు గుర్తు. తరువాత అన్నయ్య దగ్గరకు వెళ్లడం.. అటు నుంచి ఇటు రావడం ఈ ప్రక్రియలో పుట్టిన రోజుని నేను, నాతో పాటు ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయారు అని పవన్ చెప్పుకొచ్చారు.

    వదిన డబ్బులిస్తే..

    వదిన డబ్బులిస్తే..

    రెండు రోజుల తరువాత ఇంట్టో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునే వాడిని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోకపోవడం అలవాటు లేదు. సినిమాల్లోకి వచ్చిన తరువాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అనిపించింది. కేక్ కట్ చేయడం, ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించి మానేశాను. అంతే తప్పా ప్రత్యేకంగా వేరే కారణాలేవీ లేవని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    English summary
    Pawan Kalyan About Birthday Celebration In His Early Days. he says that he is not interested in celebrating birthday. in his shcool days one or two time he celebrated by dustributing chocolate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X