‘చిన్న సినిమా’కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
హైదరాబాద్ : ఎ.కె.కంభంపాటి దర్శకత్వంలో జెర్సీ ప్లాట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం 'చిన్న సినిమా'. శేఖర్, జ్యోతి నిర్మాతలు. అర్జున్ కళ్యాణ్, సుమోన నాయకానాయికలు. శనివారం విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు గుప్పించారు.
ఈ చిత్ర దర్శకుడు ఎకె.కంభంపాటిని పవన్ కళ్యాణ్ ప్రశంసించడంతో పాటు...ఈ సినిమా పోస్టర్ స్కెచ్‌లు డిఫరెంటుగా ఉన్నాయని మెచ్చుకున్నారట. దర్శకుడి తొలి సినిమాకే ఇలాంటి ప్రశంసలు అందడం అదృష్టం కాక మరేమిటి. పవర్ స్టార్ పశంసలతో ఈ సినిమాకు ప్రేక్షకుల తాడికి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

విడుదలకు ముందు చిత్ర దర్శకుడు సినిమా కాన్సెప్టు గురించి మీడియాకు వివరిస్తూ....' సెటైర్, ఫిలాసఫీ..అందులోంచి పుట్టే హాస్యం మా సినిమాలో ప్రత్యేకం. తెరపై కనిపించే ప్రతి పాత్రా ఓ సెటైర్. చిన్న చిన్న ఆనందాలు... ఉద్వేగాల్ని అందంగా ఆవిష్క రించాం. ప్రత్యేకించి సిల్లీ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ముఖ్యంగా ఈ చిత్రంలో 'రామాలయం' అనే టాపిక్ హైలైట్. అదేమిటనేది తెరపైనే చూడాలి. చిత్రంలో 70 శాతం అమెరికా నేపథ్యం, 30 శాతం హైదరాబాద్ నేపథ్యం చూపించామని తెలిపారు.
అమెరికా అనగానే సాఫ్ట్‌వేర్ గుర్తొస్తుంది. అయితే ఆ రంగానికి సంబంధించిన కథ కాదు. ఎన్నారైల్లో వేరే కోణం చూపిస్తున్నాం. దానం చేసేవాడికి స్వార్థం ఉండకూడదు. స్వార్థంతో చేస్తే అప్పటికి ఓకేగానీ భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. అనే సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తున్నాం. మహేష్ విలనీ, అర్జున్ నటన, నర్తకిగా కోమల్‌ఝా ఎపిసోడ్, క్లైమాక్స్ ముందు సన్నివేశాలు, సంగీతం, సంభాషణలు హైలైట్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చే చిత్రం మా చిన్న సినిమా"అని అన్నారు. ''న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో మేకింగ్‌పై శిక్షణ పొందాను. ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా. దర్శకత్వం అంటే ఇష్టంతో అమెరికా ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చేశా. త్వరలో మరో చిత్రం ప్రారంభించబోతున్నాము"అని ఎ.కె. కంభంపాటి తెలిపారు.


Click it and Unblock the Notifications











