twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖుషి రిలీజ్ ముందురోజు నా జాతకం తెలిసిపోయింది.. చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై పూర్తి దృష్టి కేటాయించి రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రవాస ఆంధ్రులతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. డల్లాస్ లో జరిగిన ప్రవాస గర్జన సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినీ రాజకీయ అంశాలని ప్రస్తావిస్తూ తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలని వివరించారు. దశాబ్దకాలం పాటు సరైన విజయం లేకపోవడంతో కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందులని పవన్ కళ్యాణ్ వివరించారు.

    యుక్త వయసులో

    యుక్త వయసులో

    తాను యుక్త వయసులో ఉన్న సమయంలో ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితుడినయ్యే వాడిని అని పవన్ అన్నారు. నాకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజ సేవ చేయాలనీ అప్పట్లో బలమైన కోరిక ఉండేది. ఈ విషయాన్ని అన్నయ్య చిరంజీవికి చెప్పినప్పుడు సరదా సంఘటన జరిగింది. ఓ రోజు అన్నయ్య ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడిగారు. నేను ఆధ్యాత్మికత గురించి హితబోధలాగా చెప్పానని పవన్ సరదాగా వ్యాఖ్యానించారు.

    చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే

    చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే

    నేను చెప్పే విషయాలని అన్నయ్య చాలా ఓపికగా విన్నారు. నీకేంటిరా.. చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే ఎన్నైనా మాట్లాడుతావు. ఎవరికీ సంపాదించి పెట్టాల్సిన పనిలేదు.. చాదివావా లేదా అని అడిగేవాడు లేడు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇదే విషయాలు అనుభవపూర్వకంగా చెప్పు అప్పుడు వింటాను అని అన్నయ్య అన్నారు. ఆ తరువాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు.

    దురదృష్టమో.. అదృష్టమో తెలియదు

    దురదృష్టమో.. అదృష్టమో తెలియదు

    దురదృష్టమో.. అదృష్టమో తెలియదు కానీ నా సినిమాలు బాగా ఆడినప్పుడు నాకు డబ్బులు రాలేదు. ప్లాప్ అయినప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చాయి అని పవన్ తెలిపారు. నాసినిమాలు ప్లాప్ అయ్యే కొద్దీ రెమ్యునరేషన్ పెరిగేది. అది ఎందుకో నాకు కూడా అర్థం అయ్యేది కాదు. అలా దాదాపు 20 కోట్లకు పైగా టాక్స్ కట్టే స్థాయికి చేరుకున్నానని పవన్ అన్నారు. సినిమాల్లో నటించే సమయంలో రాజకీయ బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని పవన్ తెలిపారు.

    నా జాతకం అప్పుడే తెలిసింది

    నా జాతకం అప్పుడే తెలిసింది

    రేపు ఖుషి చిత్రం విడుదలవుతుంది అనగా ముందురోజు నుంచి నా మనసులో కొన్ని ఆలోచనలు మొదలయ్యాయి. ఈ రోజు నుంచి నువ్వు కష్టాలు ఎదుర్కోబోతున్నావు అని నా మనసు చెప్పింది. అలా ఎందుకు అనిపించిందో తెలియదు కానీ ఖుషి తరువాత శక్తిని కోల్పోయాను. వరుసగా సినిమాలు పరాజయం చెందాయి అని పవన్ అన్నారు. అలా కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి నాకు గబ్బర్ సింగ్ వరకు సమయం పట్టిందని పవన్ అన్నారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సన్నివేశం చేస్తున్నప్పుడు నా శక్తి నాకు తిరిగి వచ్చిందనే భావన కలిగిందని పవన్ ప్రవాస గర్జన సభలో పేర్కొన్నారు.

    English summary
    Pawan Kalyan about failure after Kushi movie. Reveals interesting conversation with Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X