ప్రశాంతంగా ఉందయ్యా : ఇదీ పవన్ కళ్యాణ్ మాట!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేసన్లో ‘గోపాల గోపాల' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇంతకీ ఇంత అద్భుతంగా పోస్టర్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా? ఎబి కోర్ డిజైన్ సంస్థ. అనిల్ చంద్రకాంత్, భాను అవిర్నేని ఈ సంస్థ యజమానులు. 2002 నుండి ఈ సంస్థ తెలుగు సినిమాలకు పోస్టర్లు డిజైన్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘గోపాల గోపాల' మోషన్ పోస్టర్ డిజైన్ చేసింది వీరే.
తాజాగా వీరు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....సినిమా పోస్టర్ బాగుందని అంతా ప్రశంసించారని, పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుందన్నారు. ‘చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉందయ్యా చుడటానికి' అని పవన్ కళ్యాణ్ అనడం చాలా ఆనంగా ఉంది అని వారు చెప్పుకొచ్చారు.

‘గోపాల గోపాల' సినిమా విషయానికొస్తే.... హిందీలో విజయవంతమైన ‘ ఓ మైగాడ్ ' చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్‌గా తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ గోపాల గోపాల '. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఊయలలో ఊగుతున్న కృష్ణుడిలా ఉన్న పవన్‌ను వెంకటేష్ అనుకరించడం ఈ పోస్టర్‌లోని విశేషం. కిషోర్ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి అనుప్‌రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్ మరారీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధుశాలిని, దీక్షాపంత్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారణాశిలో పది నుంచి పన్నెండు రోజుల వరకూ షూట్ ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందరి ఊహగానాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్‌లో టాక్ వినబడుతోంది.


Click it and Unblock the Notifications











