మూడో పెళ్లిపై పవన్ వివరణ, రాహుల్ బ్రహ్మచర్యంపై డౌట్

By Bojja Kumar

హైదరాబాద్: తన వ్యక్తి గత విషయాలను బయట మాట్లాడటానికి అస్సలు ఇష్ట పడరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ మధ్య పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనం. అయితే తన మూడో పెళ్లి గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదు. ఆ మధ్య ఇండియా టుడే స్పెషల్ ఇష్య్వూలో ఆయన ఈ విషయాలు చెప్పారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టారు పవన్ కళ్యాణ్. మూడో పెళ్లి విషయం బయట పెట్టారు. అదే విధంగా తనకు ముగ్గురు పిల్లలు అని తెలిపారు. 2, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారని, 9 ఏళ్ల వయసున్న కొడుకున్నాడని తెలిపారు.

Pawan Kalyan about his family

పవన్ కళ్యాణ్ 1997లో నందిని అనే మహిళను పెళ్లాడారు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి నటి రేణు దేశాయ్‌ని పెళ్లాడారు. రేణు దేశాయ్ ద్వారా పవన్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కొడుకు పేరు అకీరా నందన్. కూతురు పేరు ఆద్యా. ఆయన మూడో వివాహం చేసుకున్న విదేశీ వనిత అన్నా లెజినెవా ద్వారా ఆయన మరో కూతురుకు జన్మనిచ్చినట్లు స్పష్టం అవుతోంది.

మూడు పెళ్లిళ్లు చేసుకున్నోడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడు? అనే కాంగ్రెస్ నాయకుల విమర్శలపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. 'ఒక పెళ్లి చేసుకుని ముప్పై మందితో తిరుగుతున్న మీ వాళ్ల సంగతేంటి? అసలు పెళ్లే చేసుకోలేదని మీ రాహుల్ గాంధీ గురించి గొప్పగా చెబుతున్నారు..కానీ బ్రహ్మచారి అని మాత్రం ఎవరూ చెప్పడం లేదు' అంటూ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X