For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్‌ కళ్యాణ్- ఫామ్ హౌస్ కబుర్లు (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ :మా ఇంట్లో గనుక నన్ను వదిలేస్తే ఓ రెండు మూడెకరాల చిన్న పొలం చూసుకుని,అక్కడ పొలం పని చేస్తూ కాలం గడిపేసేవాడ్ని. నా మనస్సులో నిరంతరం మెదిలే ఆలోచనలు రెండే. ఒకటి మొక్కలు పెంపకం. రెండు సమాజంలో జరిగే అన్యాయాలు అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వూలో పవన్ తన మనస్సులో అభిప్రాయాలు ఇలా చెప్పారుడు.

  అలాగే నేను ఎప్పుడూ తోటమాలి అవ్వాలని కోరుకుంటాను...నేను ఎక్కువ సేపు నా సమయాన్ని తోటలో గడపటానికి ఇష్టపడతాను అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ధన్ వాడా లో ఈ ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవటం, కొన్ని చిత్రాలుకు షూటింగ్ కు దీనిని వినియోగిస్తూంటారు.

  పవన్ కళ్యాణ్ షూటింగ్ లేని సమయంలో ప్రకృతిలో గడుపుతూంటారు. తెరమీద రైతు పాత్రలో జీవించే నటులను ఎంతోమందిని చూస్తున్నాం. కానీ అందులో అసలు వ్యవసాయమంటే ఏంటో తెలీనివారున్నారు, తాము ఎంత పెద్దస్టార్లు అయినప్పటికీ 'పొలం' బాట మరచిపోనివారూ ఉన్నారు. పొలంమీద ప్రేమతో వ్యవసాయక్షేత్రాలు ఏర్పాటు చేసుకుని తీరికవేళలో రైతుబిడ్డల అవతారమెత్తుతున్న వారిలో పవన్ ముందున్నారు.

  ఇంకా పవన్ తో పాటు ఎవరెవరు...స్లైడ్ షో లో..

  సినిమాల కంటే...

  సినిమాల కంటే...

  పవన్‌కు సినిమాలకంటే వ్యవసాయమంటేనే చాలా ఇష్టం. 'జీవితంలో కనీసం ఎకరం పొలమైనా కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటే చాలు' అని కోరుకునేవాడు. ఆ అభిరుచితోనే ఆయన రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

  పవన్ తోటలో..

  పవన్ తోటలో..


  పవన్ ఫామ్ హౌస్ లో మామిడి తోటలూ, పండ్ల తోటలూ పెంచుతున్నాడు. ఆకు కూరలూ, కొన్ని రకాల కూరగాయలూ పండిస్తున్నాడు. పాడిగేదెలూ ఎక్కువగానే ఉన్నాయి.

  పూర్తి రైతులా...

  పూర్తి రైతులా...

  అక్కడ ఓ పూర్తిస్థాయి రైతులా మారిపోయి పొలం పనులు చేస్తుంటాడు. ట్రాక్టర్‌తో దుక్కి దున్నడం, మొక్కలకు నీళ్లు పట్టడం, ఎరువులు చల్లడం, మందులు పిచికారీ చేయడం లాంటి పనులన్నీ చేస్తుంటాడు.

  కథలు చెప్పాలంటే...

  కథలు చెప్పాలంటే...

  నిజ జీవితంలో చాలా సాధారణ జీవితాన్ని ఇష్టపడే పవన్‌ కల్యాణ్‌ ఎక్కువగా ఈ ఫామ్‌హౌస్‌లోనే గడుపుతుంటాడు. దర్శకులు కూడా ఆయనకు సినిమా కథ వినిపించాలంటే ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిందే.

   గిప్ట్ గా...

  గిప్ట్ గా...

  తన తోటలో పండిన ఫలాలను పవన్ తన స్నేహితులకు పంపుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఏ రేంజిలో హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. 81 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలోని రికార్డులన్నింటీనీ బద్దలు కొడుతూ కలెక్షన్ల పరంగా కేకపుట్టిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ మామిడి పళ్లను పంపిణీ చేసారు. ఇవి ఎక్కడో బయట కొని తీసుకొచ్చినవి కాదు... పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సొంత తోటలో పండించిన ఫలాలు.

  రజనీకాంత్ సైతం...

  రజనీకాంత్ సైతం...

  క్రేజ్ లోనే కాదు పవన్ కి,రజనీకి ఫామ్ హౌస్ జీవితంలోనూ పోలికలు ఉన్నాయి. కోట్ల సంపద ఉన్నా రజనీకాంత్‌ చాలా సాదా జీవితాన్నే కోరుకుంటాడు. ఆయనకు చెన్నై శివారులోని కేళంబాక్కంలో పెద్ద వ్యవసాయక్షేత్రం ఉంది. అందులో రకరకాల పంటలూ, మామిడి, జామ, సపోట లాంటి తోటలూ పెంచుతున్నారు. రజనీకాంత్‌ ఎక్కువగా ఈ పొలంలోనే గడుపుతాడు. కొన్నిసార్లు నెలల తరబడి ఇక్కడే ఉండిపోతాడు.

  ఆ సమయంలో రజనీ...

  ఆ సమయంలో రజనీ...

  ఇటీవల రజనీకాంత్ శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు వ్యవసాయక్షేత్రం లో విశ్రాంతి తీసుకున్నాడు. ఫామ్‌హౌస్‌లో పనివాళ్లతో కలిసిపోయి తరచూ పొలం పనుల్లో సాయం చేస్తుంటాడు. ఈ వ్యవసాయక్షేత్రానికి ఎంతమంది వచ్చినా అందరికీ మజ్జిగా, పాలూ ఇస్తుంటాడు.

  ప్రకాష్ రాజ్...

  ప్రకాష్ రాజ్...

  విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌కు వ్యవసాయక్షేత్రాలంటే చాలా ఇష్టం. చెన్నై శివార్లలోని మహాబలిపురం వద్ద ఏడున్నర ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. అదే ఆయన ఇల్లు. అక్కడున్న తన కుమారుడు సిద్ధూ సమాధి వద్ద రోజూ కొంతసేపు గడపడం ఆయనకు అలవాటు. ఫామ్‌హౌస్‌లో కొబ్బరి చెట్లూ, మామిడి చెట్లూ, కొన్ని రకాల బాతులూ, కోళ్లూ పెంచుతున్నాడు. వ్యవసాయక్షేత్రంలో ప్రకాష్ రాజ్ ఆరుబయటే స్నానం చేస్తాడు. అందుకోసం ప్రత్యేకంగా షవర్‌ ఏర్పాటు చేసుకున్నాడు. తన వ్యవసాయబావిలోని నీరంటే ఇష్టం. తాగడానికి వాటినే వాడతాడు. హైదరాబాద్‌ శివారులోనూ ఆయనకు మరో వ్యవసాయక్షేత్రం ఉంది. ట్రాక్టర్‌ కొని వ్యవసాయం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక. ఇటీవలే ట్రాక్టర్‌ కొన్నాడు. దాంతో పొలం దుక్కి దున్ని సంబరపడ్డాడు. వ్యవసాయక్షేత్రంలో ఆయనకు ప్రతి చెట్టూ, మొక్కతోనూ విడదీయలేని అనుబంధం ఉంది.

  సల్మాన్‌ సైతం...

  సల్మాన్‌ సైతం...

  ముంబయికి 40 కిలోమీటర్ల దూరాన కొండ ప్రాంతంలో సల్మాన్‌కు 150 ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉంది. దానికి తన చెల్లెలు 'అర్పిత' పేరు పెట్టుకున్నాడు. అక్కడ బిందు, సేంద్రీయ సాగు పద్ధతుల్లో చీనీ, జామ, దానిమ్మ, ద్రాక్ష తోటలూ, రకరకాల కూరగాయలూ సాగు చేస్తున్నాడు. ప్రకృతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ క్షేత్రంలో సల్మాన్‌ రోజూ ఉదయాన్నే బైకుపైన చక్కర్లు కొడుతుంటాడు. అందులో మూడు పెద్ద బంగళాలూ, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌ కూడా ఉన్నాయి. పనివాళ్లతో కలిసి సల్మాన్‌ తరచూ పొలం పనుల్లో సందడి చేస్తుంటాడు. ఫామ్‌హౌస్‌ పక్కనే ఉన్న గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశాడు. వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఫామ్‌హౌస్‌లో ఒక ప్రత్యేక వాహనం సిద్ధంగా ఉంటుంది.

  మమ్ముటి నారు మడి

  మమ్ముటి నారు మడి

  రైతు కుటుంబం నుంచి వచ్చిన మలయాళ మెగాస్టార్‌ మమ్ముటికి వ్యవసాయమంటే చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టం. ఆయన పెద్ద స్టార్‌గా వెలుగొందుతున్నా తన పొలం పనులను మాత్రం మరచిపోడు. కేరళలోని చీపుంకల్‌ వద్ద ఆయనకు 17 ఎకరాల పొలం ఉంది. తన బాల్య మిత్రుడితో కలిసి అందులో వరి పండిస్తున్నాడు. తరచూ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్ని, వరినాట్లు వేయడం, కలుపుతీత, వరికోత లాంటి పనులు చేసి వస్తుంటాడు. ఇటీవలే ఆయన జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం కూడా చేపట్టాడు.

  English summary
  Pawan earlier quoted several times that he was not interested in cinema, and was keen on being a farmer. Keeping his own interests alive, Pawan is spending his time in farming at his farmhouse in Ranga Reddy district.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more