ఫస్ట్ మూవీ తర్వాత ఎవరూ నమ్మలేదు.. నన్ను పవర్ స్టార్ చేసింది ఈయనే.. పవన్ కళ్యాణ్!

Recommended Video

Pawan Kalyan About His Second Film Producer At Railway Koduru | Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన జనసేన పార్టీని ఎన్నికల సమరానికి సిదాం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పవన్ రాయలసీమ టూర్ కొనసాగుతోంది. కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇటీవల పవన్ పర్యటించారు. రైల్వే కోడూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

 రైల్వే కోడూరు వ్యక్తే

రైల్వే కోడూరు వ్యక్తే

జనసేన పార్టీ కార్యకర్తలని ఆకట్టుకునేలా ప్రసంగించిన పవన్ మధ్యలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు రైల్వే కోడూరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను మీరంతా పిలుచుకునే పవర్ స్టార్ అయ్యానంటే అందుకు కారణం రైల్వేకోడూరుకు చెందిన వ్యక్తే అని పవన్ తెలిపారు. తాను తొలి రెమ్యునరేషన్ తీసుకుంది రైల్వే కోడూరుకు చెందిన నిర్మాత నుంచే అని పవన్ అన్నారు.

తొలి చిత్రం తర్వాత

తొలి చిత్రం తర్వాత

పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. తన తొలి చిత్రం తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదని పవన్ అన్నారు. నన్ను నమ్మి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో నన్ను నమ్మిన ఏకైక వ్యక్తి రైల్వే కోడూరుకు చెందిన నిర్మాత దాశరథి గారు అని పవన్ తెలిపాడు.

సభలోనే నిర్మాత

సభలోనే నిర్మాత

పవన్ ఈ విషయం చెబుతున్న సమయంలో దాశరథి అక్కడే ఉంటూ ఓ మేడ మీది నుంచి ప్రసంగాన్ని వింటున్నారు. సభలో పవన్ పక్కన ఉన్న నాయకులు ఆయన ఇక్కడే ఉన్నారు అని చెప్పగానే పవన్ ఆశ్చర్యపోయాడు. ఇక్కడే ఉన్నారా.. రండి ఇక్కడి అని పిలిచాడు. వేదిక వద్దకు వచ్చిన దాశరథి పవన్ ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పవన్ ఆయన చేయి పట్టుకుని నాకు తొలి రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాత ఈయనే అని ప్రజలకు తెలియజేశారు.

 తొలి సీటు

తొలి సీటు

నాకు తొలి పారితోషికం రైల్వే కోడూరుకు చెందిన వ్యక్తి నుంచి వచ్చింది. జనసేన పార్టీకి గెలిచే సీటు కూడా రైల్వేకోడూరు నియోజకవర్గమే కావాలని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం లాంటి చిత్రాల్లో నటించారు. తొలి ప్రేమ చిత్రంతో పవన్ కు తొలి బ్లాక్ బస్టర్ దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X