Akira Nandan టాలీవుడ్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. సింపుల్ ఆన్సర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కు సోషల్ మీడియాలో పెరుగుతున్న చూస్తూ ఉంటే తప్పకుండా అతని ఎంట్రీ ఊహించని రేంజ్ లో ఉంటుంది అని ఫాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు కానీ అసలు అకిరా తండ్రికి తగ్గట్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే పవన్ కళ్యాణ్ అకిరా ఎంట్రీ గురించి.. ఇచ్చిన ఒక వివరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తప్పకుండా క్రేజ్ వచ్చే అవకాశం
సినిమా ఇండస్ట్రీలో వారసులుగా వచ్చిన కొందరు యువ హీరోలు మంచి క్రేజ్ అందుకుంటున్నారు. అయితే వారసత్వం ఎంట్రీ అనేది కేవలం ఒక సినిమా వరకే హెల్ప్ అయినప్పటికీ కూడా ఫ్యాన్ బేస్ బలంగా ఉంటే మాత్రం వారి కెరీర్ కు ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ తనయుడు ఎప్పుడూ ఎంట్రీ ఇస్తాడో కానీ తప్పకుండా మాత్రం అతనికి భారీ స్థాయిలో క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చూస్తేనే అర్థమవుతుంది.

అకిరా ఫొటోలు వస్తే..
అకిరా నందన్ ప్రైవసీ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఇక అతనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను తల్లి రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సోషల్ మీడియాలో అతని పేరు ఒక్కసారిగా వైరల్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తో కనిపించిన ఫోటోలు కూడా ఇంటర్నెట్లో ట్రెండింగ్ లిస్టులో నిలిచాయి.

తల్లి ఆలోచన
ఇక అకిరా నందన్ ఇటీవల 18వ ఏడాదిలోకి అడుగుపెట్టడంతో తప్పకుండా అతను త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు అని కథనాలు వెలువడుతున్నాయి. అయితే గతంలో రేణు దేశాయ్ మాత్రం కొడుకు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పట్లో నిర్ణయించేది కాదు అని అసలు అకిరా నందన్ కు ఇప్పుడు అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదు అని అతని ఫోకస్ మొత్తం చదువుపై ఉంది అని అన్నారు. అలాగే మ్యూజిక్ పై కూడా శ్రద్ధ పెడుతూ ఉంటాడు అని రేణు దేశాయ్ తెలియజేశారు.

పవన్ ఏమన్నారంటే..
అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీ కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారా అని అడిగినప్పుడు పవన్ సూటిగా ఒకే సమాధానం ఇచ్చారు. వారసత్వంగా వచ్చేది ఏదైనా సరే వారికి ఇష్టంగా ఉంటేనే రావాలి అని నా కొడుకు నేను చేసిన పని చేయాలి అని అనుకోవడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అన్నారు. అతని ఇష్టంగా శ్రద్దతో వస్తే తప్ప అనవసరంగా తీసుకురావాలి అనే ఆలోచన అయితే లేదని అన్నారు.

ప్రేక్షకులు ఆదరిస్తే..
అతనికి స్వతహాగా యాక్టింగ్ లోకి రావాలని ఉంటే అలాగే మంచి సినిమాలు చేసి ప్రేక్షకులు ఆదరిస్తే తప్పులేదు. కానీ ఇష్టం లేనిది అనవసరంగా రుద్దితే మాత్రం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా సరే పిల్లలను పిల్లలుగా ఎదగనివ్వాలి. వారికి ఏది ఇష్టమైన దాంట్లోనే రానించేలా చేయాలి. కానీ అనవసరంగా వారి మీద ఒక ఒత్తిడి కూడా పెంచకూడదు అని పవన్ కళ్యాణ్ గత ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.

అకిరా టాప్ హీరోగా..
అకిరా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే మాత్రం తప్పకుండా అగ్ర హీరోగా మారతాడు అని ప్రేక్షకుల్లో అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అతను టాలీవుడ్ హీరోలతో పోలిస్తే అత్యధికంగా హైట్ కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు కేవలం వరుణ్ తేజ్ మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా(6'5") హైట్ కలిగిన హీరో. ఇక ఆ కిరానందన్ మాత్రం అతనికంటే కొంత ఎక్కువ హైట్ కలిగి ఉన్నాడు మరి అకిరా ఎలాంటి కెరీర్ సెట్ చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











